ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)నటించిన పుష్ప 2(పుష్ప 2)వరల్డ్ వైడ్ గా ఈ నెల ఐదున విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.ఈ నేపథ్యంలో పుష్ప 2 మేకర్స్ టికెట్స్ రేట్లు పెంచేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కోరగా ఆయా ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం జరిగింది.
ఈ రోజు ప్రీమియర్ షోస్ ఎనిమిదివందల వరకు అమ్ముకోవచ్చని డిసెంబర్ 5 నుంచి 17 వరకు మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ కంటే రెండు వందలు అధికంగా, సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు నూట యాభై, లోయర్ క్లాసుకు వంద రూపాయిలు అధికంగాపెంచేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.కానీ ఇప్పుడు పుష్పగుచ్ఛం 2 టిక్కెట్ రెట్లు పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు విచారణకి రానుంది. ఈ నేపథ్యంలో తీర్పు పై అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది.