నటసింహం నందమూరి బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ) తనయుడు మోక్షజ్ఞ (మోక్షజ్ఞ) సినీ రంగ ప్రవేశం గురించి తెలిసిందే. మోక్షజ్ఞ మొదటి సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీ డిసెంబర్ 5న లాంచ్ పవర్. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ మొదటి సినిమా సెట్స్ మీదకు వెళ్ళకముందే, రెండో సినిమా కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సెకండ్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట.
హీరోగా పరిచయం కాకముందే, కేవలం లైనప్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు మోక్షజ్ఞ. మామూలుగా వారసులను పరిచయం చేసేటప్పుడు, స్టార్ తో యాక్షన్ సినిమా చేయడానికి డైరెక్టర్ ఆసక్తి చూపిస్తారు. కానీ తనయుడు మోక్షజ్ఞ విషయంలో బాలకృష్ణ వేస్తున్న అడుగులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కి తన కుమారుడితో సినిమాలు ఇస్తున్నాడు బాలయ్య.
మోక్షజ్ఞ మొదటి రెండు సినిమాల విషయంలో దర్శకుల ఎంపిక బాగుందని చెప్పవచ్చు. ‘అ!’ వంటి విభిన్న చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ, ‘హనుమాన్’తో పాన్ ఇండియా సక్సెస్ అందుకొని సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం ప్రశాంత్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి మెచ్చుకోదగ్గ విషయం. ఇక రెండో సినిమా విషయంలోనూ అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ‘తొలిప్రేమ’ వంటి లవ్ స్టోరీ తో డైరెక్టర్ గా ప్రయాణం మొదలుపెట్టిన వెంకీ అట్లూరి.. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి కంటెంట్ సినిమాలతో ప్రతిభను చాటుకున్నాడు. అలాంటి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరిని మోక్షజ్ఞ రెండో ఎంపిక చేయడం కూడా మంచి నిర్ణయమని చెప్పాలి.