పుష్ప-2 భారీ చిత్రం అంచనాల నడుమ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదలకు ముందు ఈ సినిమాకి అన్నీ మంచి శకునములే ఎదురవుతున్నాయి. ప్రచార చిత్రాలకు అదిరిపోయే స్పందన లభించింది. అలాగే నేషనల్ వైడ్ గా జరిపిన ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో మంచి శకునం ఏర్పడింది. (పుష్ప 2 రూల్)
హైదరాబాద్ లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ వీడింది. డిసెంబర్ 2న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైల్డ్ ఫైర్ జాతర పేరుతో ఈవెంట్ జరగనుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది బన్నీకి ఎంతో కలిసొచ్చిన వేదిక. అల వైకుంఠపురములో ఈవెంట్ జరగగా, ఆ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పుష్ప-1 ఈవెంట్ జరగగా, ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసా. ఇక ఇప్పుడు పుష్ప -2 ఈవెంట్ జరగనుంది. అసలే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అంచనాలకు, ఈ సెంటిమెంట్ కూడా తోడైతే రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహలకు కూడా అందదని బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నాయి.