Home సినిమా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను – Sneha News

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను – Sneha News

by Sneha News
0 comments
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను


తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్(rajendra prasad)నాలుగున్నర దశాబ్దాల ఆయన ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు(pv narasimha rao)అంతటి వ్యక్తే రాజేంద్ర ప్రసాద్ అభిమాని. దీన్ని బట్టి రాజేంద్ర ప్రసాద్ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, ఇప్పుడు మళ్ళీ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.రీసెంట్ గా విడుదలైన ‘లగ్గం’ మూవీలో ప్రధాన పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో భాగస్వామ్యమయ్యాడు.

రీసెంట్ గా అయన ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఫాడ్ కాస్ట్ లో మాట్లాడుతు ఇంజనీరింగ్ పూర్తి చేసాను నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మద్రాస్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను.కానీ స్కూల్ టీచర్ అయిన మా నాన్నకి మాత్రం నేను వెళ్లడం ఇష్టం లేదు.నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావు,అక్కడ నువ్వు ఫెయిల్ అయినా, విజయం సాధించిన అదంతా నీకు సంబంధించినది. విషయం.ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని చాలా కఠినంగానే చెప్పాడు. ఇక ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి గోల్డ్ మెడల్ కూడా సాధించాను.కానీ అవకాశాలు రాకపోవడంతో ఇంటికి వెళ్ళాను. కానీ ఎందుకొచ్చావురా అని మా నాన్న కోప్పడటంతో మళ్ళీ చెన్నై వచ్చాను. కానీ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకొని, ఒకసారి తెలిసిన వాళ్ళందర్నీ చూడాలని వాళ్ళ ఇళ్ళకి వెళ్లి మాట్లాడాను.

చివరిసారిగా ప్రముఖ నిర్మాత పండరి కాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్ళాను.ఆ టైం లో ఆయన కొత్త మూవీ ‘మేలుకొలుపు’ సినిమాకి సంబంధించిన గొడవ ఏదో జరుగుతూనే ఉంది. ఆయన నన్ను చూడగానే ఏం మాట్లాడకుండా ఒక సీన్ కి నాతో డబ్బింగ్ చెప్పారు. అది ఆయనకి నచ్చి భలే దొరికావని చెప్పి రెండో సీన్ కి కూడా డబ్బింగ్ చెప్పమంటే, భోజనం చేసి మూడు నెలలు అయ్యింది,భోజనంపెడితే డబ్బింగ్ చెప్తానంటే ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానే విషయం చెప్పేసరికి నన్ను కోప్పడ్డారు.ఆ తర్వాత కంటిన్యూగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలకి డబ్బింగ్ చెప్పాను.అలా వచ్చిన డబ్బుతో మద్రాస్ లో ఇల్లు కూడా కట్టాను.ఆ తర్వాత దర్శకుడు వంశీ పరిచయమవ్వడంతో అతని సినిమాల ద్వారానే హీరోగా పరిచయం అయ్యానని చెప్పాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ కుమార్తె చనిపోయిన విషయం తెలిసిందే.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech