విక్టరీ వెంకటేష్(venkatesth)హీరోగా 1996లో వచ్చిన ‘సాహసవీరుడు సాహసకన్య’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ శిల్పాశెట్టి(shilpa shetty).ఆ తర్వాత బాలకృష్ణ(balakrishna)మోహన్ బాబు(mohan babu)నాగార్జున(nagarjuna)వంటి హీరోలతో కూడా నటించి తెలుగు నాట మంచి గుర్తింపు పొందింది. .హిందీ,తమిళ,కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించిన శిల్పం శెట్టి 2009లో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాని వివాహం చేసుకున్నారు.
అవకాశాల కోసం ముంబై వచ్చే యువతలని వంచించి, వారితో అశ్లీల చిత్రాలను నిర్మించి, వాటిని పలు యాప్ ల ద్వారా విడుదల చేసి పెద్ద ఎత్తున డబ్బు ఆర్జించిన కేసులో 2021లో రాజ్ కుంద్రా అరెస్టయిన విషయం తెలిసిందే.ఈ కేసులో రాజ్ కుంద్రా(raj kundra)కొన్ని నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు.ఇప్పుడు ఈ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాజ్ కుంద్రా కి చెందిన ముంబై, ఉత్తర ప్రదేశ్ లోని పదిహేను పాంత్రాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వీటిపై శిల్పాశెట్టి లాయర్ మాట్లాడుతూ ఈడి సోదాల వార్త అబద్దం. రాజ్ కుంద్రా కేసు కి సహకరిస్తున్నారు. ఎవరు కూడా ఈ విషయంలో శిల్పా శెట్టి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉపయోగించవద్దు.ఒక వేళ ఎవరైనా ఉపయోగించిన యెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.