‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ నుంచి సోలో హీరోగా వస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని, గ్లోబల్ స్టార్ ఇమేజ్ నిలుపుకోవాలని చూస్తున్నాడు చరణ్. కానీ పరిస్థితులు మాత్రం అంతగా అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు. (గేమ్ ఛేంజర్)
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ కావడంతో ‘గేమ్ ఛేంజర్’పై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, సాంగ్స్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు.. రికార్డు కలెక్షన్స్ వస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇతర భారీ సినిమాలతో ఉన్న పోటీనే కాస్త ఇబ్బందికరంగా మారేలా ఉంది. (రామ్ చరణ్)
‘గేమ్ ఛేంజర్’ ఎంత పాన్ ఇండియా సినిమా అయినా, చరణ్-శంకర్ కాంబో కాబట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు కలెక్షన్లు కీలకం. మెజారిటీ కలెక్షన్లు ఈ మూడు రాష్ట్రాల నుంచే వస్తాయి. అయితే ఈ రాష్ట్రాల్లో ‘గేమ్ ఛేంజర్’ వసూళ్లకి భారీ గండి పడే అవకాశం కనిపించింది.
‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబడింది. అయితే అదే సమయంలో తెలుగులో రెండు భారీ సినిమాలున్నాయి. అందులో ఒకటి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ కాగా, రెండోది వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాలు ‘గేమ్ ఛేంజర్’ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అలాగే తమిళ్ లో పొంగల్ కి అజిత్ ‘విడాముయర్చి’ విడుదలవుతోంది. దానికి తగినన్ని థియేటర్లు దొరకవు. దానికితోడు ఎంత శంకర్ సినిమా అయినా, అజిత్ సినిమా పోటీలో ఉన్న తమిళ ప్రేక్షకులు ‘విడముయార్చి’ చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అంతేకాదు ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాల వల్ల ‘గేమ్ ఛేంజర్’ యూఎస్ కలెక్షన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
సంక్రాంతి సీజన్ లో రెండు మూడు భారీ సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. అదొక్కటే ‘గేమ్ ఛేంజర్’కి కలిసొచ్చే అంశం. అయితే అది జరగాలంటే ‘గేమ్ ఛేంజర్’కి పాజిటివ్ టాక్ రావాలి. మరి ఈ అడ్డంకులను చరణ్ దాటుకొని ‘గేమ్ ఛేంజర్’తో రామ్ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి చూపిస్తాడేమో చూద్దాం.