స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు మాత్రమే కాదు, ఆయన సినిమాల్లోని పాటలు కూడా భారీగా ఉంటాయి. శంకర్ తన సినిమాల్లో పాటలపై ప్రత్యేక దృష్టి పెడతారు. మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్.. ఇలా ప్రతి దానిలో తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. ఒక్కోసారి ఒక సాంగ్ ని చిత్రీకరించడానికే, ఏకంగా ఒక చిన్న సినిమా బడ్జెట్ అంత ఖర్చు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆ ఖర్చుకి తగ్గట్టుగానే అవుట్ పుట్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. కేవలం పాటల కోసమే.. శంకర్ సినిమాలను రిపీటెడ్ గా చూసినవాళ్లు ఎందరో ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన శంకర్ సినిమాల్లోని పాటలను.. ఇప్పటికీ వింటున్నారు, చూస్తున్నారు. అది శంకర్ సాంగ్స్ క్రియేట్ చేసిన బ్రాండ్. ఆ బ్రాండ్ ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’కి కూడా కొనసాగుతోంది. (గేమ్ ఛేంజర్)
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఆ రెండు పాటలు బాగానే ఉంటాయి, శంకర్ రేంజ్ సాంగ్స్ కాదనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ కామెంట్స్ కి చెక్ పెడుతూ “నానా హైరానా” అంటూ సాగే మూడో సాంగ్ వచ్చింది. ఈ మెలోడీ సాంగ్ కి థమన్ అందించిన సంగీతం కట్టిపడేస్తోంది. “నానా హైరానా.. అరుదైన హైరానా.. నెమలీకల పులకింతై, నా చెంపలు నిమిరేనా” వంటి బ్యూటీఫుల్ లైన్స్ తో రామజోగయ్యశాస్త్రి అందించిన లిరిక్స్ హత్తుకునేలా ఉన్నాయి. అలాగే శ్రేయా ఘోషల్, కార్తీక్ ల మధుర గాత్రం పాటలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. (నానా హైరానా పాట)
ఇలాంటి బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ పడితే.. డైరెక్టర్ శంకర్ దానిని విజువల్ గా ఏ రేంజ్ కి తీసుకెళ్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. “నానా హైరానా” సాంగ్ విషయంలోనూ అదే జరిగింది. విజువల్ గా సాంగ్ అదిరిపోయింది. లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సాంగ్ లో ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా ఉంది. బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా? అనే ఫీలింగ్ ని ఈ సాంగ్ కలిగిస్తోంది. మొత్తానికి “నానా హైరానా”తో శంకర్ తన బ్రాండ్ సాంగ్ ఎలా ఉంటుందో మరోసారి చూపించారని చెప్పవచ్చు.