అగ్ర హీరో సూర్య(సూర్య)నవంబర్ 14న పాన్ ఇండియా మూవీ ‘కంగువ'(కంగువ)తో థియేటర్స్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విడుదలకి ముందు ఎంతో హైప్ ని క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత అన్ని లాంగ్వేజెస్ లో కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది.అసలు కంగువ ప్లాప్ లేదని, సూర్య ఎదుగుదల తట్టులోలేని ఇద్దరు హీరోల అభిమానులు,రెండు రాజకీయ పార్టీలు కావాలని సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చారని ‘కంగువ’ నిర్మాతల్లో ఒకరైన ధనుంజయ్ పెద్ద బాంబ్ పేల్చాడు. .ఈ మాటలు ఇప్పుడు సౌత్ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
ఇక సూర్య తన కొత్త చిత్రం శ్రీకారం చుట్టాడు.సూర్య కెరిర్ లో నలభై ఐదవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఆర్కి జె బాలాజీ(rj balaji)దర్శకుడు కాగా డ్రైమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రభు,ప్రకాష్ బాబు అత్యంత భారీ వ్యయంతో ఉన్నారు.ఈ మేరకు పొలాచ్చి లోని మాసాని అమ్మన్ టెంపుల్ లో బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది.ఆధ్యాత్మికత అంశాలతో పాటు యాక్షన్ కథాంశాలతో ముడిపడిన ఈ మూవీలో సూర్య రెండు డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.
దీంతో త్రిష ఒక హీరోయిన్ గా చేస్తుండగా, ఇంకో హీరోయిన్ కి కూడా అవకాశం లేదని అంటున్నారు. కొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ మూవీ నటించబోయే ఇతర నటి నటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.ఏఆర్ రెహ్మాన్(ar rehman)సంగీత సారధ్యంలో తెరకెక్కనుండగా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మూవీ విడుదలైంది.