విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదంతో దర్శక, నిర్మాత, హీరో సత్యారెడ్డి నిర్మాణంలో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం “ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. ఈ నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. గద్దర్ మూడు పాటలు పాడి, రెండు పాటల్లో కొన్ని సందేశాత్మక సీన్స్‌లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు.
ఈ సందర్భంగా ప్రెస్మీట్లో దర్శకులు సత్యారెడ్డి, “విప్లవ కవి గద్దర్ అన్న గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం ఈ నెల 29న విడుదలైంది. తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసిన లక్ష్మి నారాయణ గారితో పాటు ఎంతో మంది ఉద్యమకారులను దృష్టిలో ఉంచుకుని సినిమా కథానాయకుడి పాత్ర గద్దర్ గారు అందించారు. ఈ సినిమా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఉద్యమ చిత్రం” అని అన్నారు.
ఎక్స్ సీబీఐ వీ డైరెక్టర్ వీ డైరెక్టర్ లక్ష్మి నారాయణ గారు, “ఉక్కు సత్యాగ్రహం చిత్రం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా ప్రయివేటీకరణ చేస్తున్నారు, అక్కడి ప్రజలు ఎలా అడ్డుకుంటున్నారు. అయన స్వతహాగా నటించిన సినిమా ఇది ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం చవిచూస్తుందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను, ఈ సినిమా అందరికీ విజయం దక్కాలని ఆశిస్తున్నాను. అని తెలిపారు.
గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడుతూ, “ఈ రోజు ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. గద్దర్ అన్న గారు హైదరాబాద్ నుండి విశాఖ కు బయల్దేరి మళ్ళీ ఇంటికొచ్చే వాళ్ళు. ఈ సినిమా కోసం ఆయన చాలా సమయం కేటాయించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశ్యం. ఎవరైతే తమ రక్తం చిందించి స్టీల్ ప్లాంట్ ని డెవలప్ చేసారో, వాళ్ళని ఈ సినిమా చేసారు గద్దర్ గారు సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
గద్దర్ , సత్యా రెడ్డి, ఝాన్సీ, ధర్మశ్రీ, ఎంవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల ఈ చిత్రాన్ని శ్రీకోటి సంగీతం అందించారు, మేనగ శ్రీను ఎడిటర్‌గా వ్యవహరించారు.