ఏపీలో ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం తరువాత ఆయన పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. ఈ విధంగానే ఆయన అనేక నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చారు. కొన్ని జిల్లాలకు అధ్యక్షులను కూడా మార్చిన ఆయన.. పలు విభాగాల బాధ్యతలను కొత్తవారికి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు కొత్త ఏడాదిలో జిల్లాల పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నారు. మూడో తేదీ నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి.. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. విభజిత 26 జిల్లాల్లోనూ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయనున్నారు. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేడర్‌కు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి కూటమి నాయకులు, కార్యకర్తలపై వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే రానున్నానన్న భరోసా కల్పించేందుకు జగన్ మోహన్ రెడ్డి ఈ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. కార్యకర్తలు, నాయకులు అందించే సలహాలను జగన్మోహన్ రెడ్డి తీసుకోనన్నారు. ప్రత్యేక కార్యాచరణను ఆయన రూపొందించారు. ఈ పర్యటన ద్వారా కార్యకర్తల్లో మానసిక స్టైర్యాన్ని కల్పించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో తమదే అన్న విజయం తర్వాత మరింత లోతుగా కేడర్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆయన చేయనున్నారు. ప్రత్యేక ప్రత్యేక వ్యూహాలను ఆయన రచిస్తున్నట్లు చూపుతున్నారు. వారికి అండగా ఉండే బలమైన నేతలకు ఆయన భరోసా జిల్లా కల్పించనున్నారు. అటువంటి నేతలకు అధికారంలోకి వస్తే అవసరమైన పదవులు ఇవ్వడంతో పాటు సహాయ సహకారాలను అందిస్తామన్న భరోసాను కల్పించినట్లు చెబుతున్నారు.
అదే సమయంలో ఇకపై తాడేపల్లి లోను ప్రజలకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వారికి నేరుగా ఇకపై అవకాశం కల్పించనున్నారు. సాధారణంగా ఇదే జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత ప్రస్తుతం తాడేపల్లిలో కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇకపై అటువంటి అపాయింట్మెంట్ తో పని లేకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లే సౌకర్యాన్ని కల్పించమన్నారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్య నాయకులకు అందించినట్లు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఇబ్బందులను తెలియజేసుకోవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించిన నేతలకు ప్రత్యేకంగా కలిసేలా తాడేపల్లి నివాసంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేనెల మొదటివారం నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టమన్నారు. ఏడాదిలోపు జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే కొత్త ఆదేశాలు పార్టీ ముఖ్య నాయకులకు అందాయి. ఏ జిల్లా నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభించాలంటే దానిపై ప్రస్తుతం ముఖ్య నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కాను ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజా నిర్ణయం వల్ల పార్టీని క్షేత్రస్థాయిలో మరి అంత బలోపేతం చేయడమే జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంది.
Best Breakfast Foods : ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవలసిన బ్రేక్ ఫాస్ట్ ఇవే..
ఈ ఆహార పదార్థాలను అస్సలు కలిపి తినకూడదు