ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తుంటే, ఆయన మాత్రం ఎవరికీ చిక్కడం లేదు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా పోలీసులు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో బృందాలుగా విడిపోయి మరీ పోలీసులు ఆర్జీవీ కోసం గాలిస్తున్నారు. ఏపీలో రామ్‌గోపాల్ వర్మపై పలు స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అసభ్యకరంగా పోస్టింగ్‌లు చేశారంటూ పలు ఫిర్యాదులు చేశారు. ఈలపై ఫిర్యాదు ఒంగోలు పోలీసులు రామ్‌గోపాల్ వర్మపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీసులు ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ పోలీసులు కొద్దిరోజుల కిందట నోటీసులు ఇచ్చారు. అయితే, రామ్‌గోపాల్ వర్మ రా పోలీసులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి స్టేషన్‌కు తీసుకురావాలని పోలీసులు భావించారు. అయితే, ఇంట్లో రామ్‌గోపాల్ వర్మ లేకపోవడంతో పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. వర్మ ఎక్కడకు వెళ్లిన ఇంట్లోని సిబ్బంది తెలియజేయలేదు. దీంతో వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోయంబత్తూరులోని లూసిఫర్-2 సినిమా షూట్లో రామ్‌గోపాల్ వర్మ బిజిగా ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అక్కడకు ప్రత్యేక బృందాలను పోలీసులు పంపించారు. వారు చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే, వర్మ ఇంకా కోయంబత్తూరులోనే ఉన్నారా..? లేక మరో గడిచిపోయారా..? అన్నది తెలియాల్సి ఉంది. రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ నెల పదో తేదీన కేసు నమోదైంది. ఈ నెల తొమ్మిదో తేదీన వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు వ్యూహం సినిమా ప్రమోషన్లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్
పోలీసులకు దొరకని రామ్ గోపాల్ వర్మ.. బృందాలుగా గాలింపు – Sneha News
32