హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి,తన అద్భుతమైన నటనతో, డాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటి రోజా(రోజా)ఆ పై రాజకీయ తెరంగ్రేటం కూడా చేసి ఎంఎల్ఏగా, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజా రీసెంట్ గా మాట్లాడుతూ తెలుగుదేశం ఆద్వర్యంలోని కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు మహిళలను కూడా చూడకుండా అసభ్య పోస్ట్‌లు చెయ్యడంతో పాటుగా అరెస్ట్‌లు కూడా మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఆమె మాటలపై ప్రముఖసోషల్ మీడియా యాక్టవిస్ట్ సంతు బాబు(santhu babu)మాట్లాడుతూ పవన్ కళ్యాణ్(pawan kalyan)చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఇళ్లల్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు రోజా ఎందుకు మాట్లాడలేదు.వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఆడవాళ్లు కాదా. పైగా ఆమె ఎవరి తరుపున అయితే మాట్లాడుతుందో వాళ్లంతా సభ్య సమాజం తలదించుకునేలా జుగుప్సాకరంగా తిట్టారు. అలాంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసారని చెప్తుంది.దీంతో రోజా నటనకి ఉత్తమ మహిళగా అవార్డు అందించాడు.