Home ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ అమలకు పక్కా ప్రణాళిక.. క్యాడర్ తో ఫిర్యాదులు వెల్లువ – Sneha News

రెడ్ బుక్ అమలకు పక్కా ప్రణాళిక.. క్యాడర్ తో ఫిర్యాదులు వెల్లువ – Sneha News

by Sneha News
0 comments
రెడ్ బుక్ అమలకు పక్కా ప్రణాళిక.. క్యాడర్ తో ఫిర్యాదులు వెల్లువ


గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు సర్వత్ర విస్మయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నాయకులను లక్ష్యంగా చేసుకుని పెడుతున్నట్లు చూస్తుంటే రెడ్ బుక్ అమలు చేయడమే ప్రధానంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర సందర్భంగా ఆయన అనేక చోట్ల రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేసిన నాయకులు, అధికారులకు తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవంటూ అప్పట్లోనే ప్రకటించారు. అడ్డగోలుగా వ్యవహరించిన వారి పేర్లు రెడ్ బుక్ లో నమోదు చేశామని. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అన్నట్టుగానే నారా లోకేష్ ప్రస్తుతం రెడ్ బుక్ లో రాసుకున్న నాయకులు, అధికారుల చిట్టా తెరుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమందిని అరెస్టు చేయించారు. ఈ జాబితాలో అరెస్టు కావాల్సిన నాయకులు కూడా ఉన్నారు. వీరి విషయంలో టిడిపి నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరినైతే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారో వారిపై కేసులను పెట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టబడిన తర్వాత నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అరెస్టు అయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇంటూరి రవి కిరణ్, వర్రా రవీందర్ వ్యవహారంలో ఇదే ఫార్ములాను కూటమి నాయకులు ఫాలో అయ్యారు.

తాజాగా అనేక చోట్ల సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిపై కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులను ఆధారంగా చేసుకుని అరెస్టు చేయడంతోపాటు.. ఇదివరకు ఉన్న కేసులకు సంబంధించిన చిట్టాను బయటికి తీసే ప్రయత్నాన్ని కూటమి నాయకులు చేస్తున్నారు. తరువాత లిస్టులో ఈ ముగ్గురు ఉన్నారని, అందుకే వీరిపై రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. తాము లక్ష్యంగా నాయకులపై ముందుకు వెళ్లడానికి వ్యూహాత్మకంగా కేసులను పెట్టిస్తున్నట్లు చెబుతున్నారు. తరువాతి దశలోనూ మరి కొంతమంది నాయకుల పేర్లు చూపిస్తున్నారు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. మిగిలిన నేతలపైన కేసులను నమోదు చేయడం ద్వారా వైసీపీని పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఎవరైతే ప్రజల్లోకి వచ్చి బలంగా వినిపిస్తున్నారో.. అటువంటి వారిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వైసిపి ప్రజల్లోకి రాకుండా చేసే ప్రయత్నం సాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ కేసునే నమోదు, పెద్ద ఎత్తున అరెస్టులు అంటూ జరుగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రెడ్ బుక్కులోని పేర్లు ఇంకెన్ని బయటకు వస్తాయో చూడాల్సి ఉంది.

మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్.. 288 స్థానాలకు ఎన్నికలు
బీట్‌రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech