- ఫోర్త్ ఎస్టేట్ గా బాధ్యతలు ఉంటాయి మీడియా..
- తెలంగాణ మీడియా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
- మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం
చౌటుప్పల్, ముద్ర న్యూస్: సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో తన కర్తవ్యాన్ని మీడియా నిర్వహించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కలిమెకొలను శ్రీనివాస్ రెడ్డి సూచించారు. యాద భువనగిరి జిల్లా చౌటుప్పల్ చౌటుప్పల్ జిల్లా వలిగొండ రోడ్డులోని ఎస్ ఎం రెడ్డి గార్ లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు దోనూరు రాంరెడ్డితన అధ్యక్షురాలు నిర్వహించిన చౌటుప్పల్ మండల ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం మీడియా అధ్య క్షుడు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా ఉన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని పూలమాలలు, శాలువాలు, బోకెలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మాట్లాడుతూ ప్రజల పక్షపాతిగా వ్యవహరిస్తూ, మీడియా స్వేచ్ఛగా తన బాధ్యతను నిర్వర్తించేందుకే ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ బడుతోందని ఆయన స్పష్టం చేశారు. అయితే సమాజ శ్రేయస్సు కోసం గతంలో మీడియా పోషించిన పాత్రకు, ప్రస్తుతం నటిస్తున్న పాత్రకు ఎంతో తేడా ఉంది. వ్యాపార కోణంలో మీడియాను కొనసాగిస్తే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజానికి మేలు చేయలేరని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా పురుడు పోసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ, ఆ స్వేచ్ఛను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సహించరానిదన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ తనవంతు కృషి చేస్తోంది. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య పథకం, ఇంటి స్థలాలు, ఇండ్లు అందించే దిశలో కృషి చేసే శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ మాట్లాడుతూ నేడు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తున్న ఏకైక సంఘం తమదేనన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో యాభై యేండ్ల నుండి క్రియాశీలక పాత్ర పోషించారు, జాతీయ స్థాయిలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన శ్రీనివాస్ రెడ్డి, మీడియా అఫ్‌సైన్ చైర్మన్ గా కొనసాగడం మీడియా రంగానికి శుభపరిణామమని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలను దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం తమ సంఘం కృషి చేయాలని విరాహత వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులకు చౌటుప్పల్ లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు, ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
పాత్రికేయులు సమస్యలను వెలుగులోకి తేవాల్సిన ప్రజాప్రతినిధి. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఎంబా నరసింహులు, పోతంశెట్టి కరుణాకర్, యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎలిమినేటి ఇంద్రారెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జర్నలిస్టుల ఆరోగ్య కమిటీ సభ్యులు జహంగీర్, జిల్లా ఉపాధ్యక్షులు నూరు రాంరెడ్డి, సీనియర్ రిపోర్టర్లు సుర్కంటి మహేందర్ రెడ్డి, పందుల నరసింహ, చిదుగుళ్ల జంగయ్య , దొడ్డి రాములు, ఉబ్బు లింగస్వామి, దోనూరు జగన్ రెడ్డి, పోలోజు శ్రీనివాసాచారి, బొమ్మ మల్లేష్, ఊదరి శ్యామ్ సుందర్, కొత్తోజు కుమారస్వామి, బుల్లోజు సందీప్, బొడిగె ప్రభాకర్, బోదుల నరేష్, సురివి కిరణ్, ఊదరి స్వామినాథం, లింగనాయక్, ఎండి రఫీ, చిలివేరు సంజీవ, కలకొండ సంజీవని ఉన్నారు.