- అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కు సమాన అవకాశాలు
- విపక్షాలు ఆందోళన చేసిన స్పీకర్ సమన్వయంతో సభను నడపాలి
- నేటి ప్రతిపక్షం సభను ఎలా వాయిదా వేయాలో చూస్తుంది
- చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం రేవంత్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతోన్న అభివృద్ధిలో లోపాలు, గాడితప్పిన పాలన గురించి అసెంబ్లీలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ది హౌస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయన్న ఆయన సభను నడిపే బాధ్యత స్పీకర్ పై ఉంటుందన్నారు. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సెర్చ్ అండ్ ట్రైనింగ్) కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు అండర్-18 మాక్ అసెంబ్లీ’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పేజీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మాక్ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని తెలిపారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు. విపక్షాలు ఆందోళన చేసిన ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలని కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలని కోరారు. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నానన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారనీ ఆయనతోనే మనకు సమాజంలో అవకాశాలు వచ్చాయి. నిర్బంధ విద్య అమలు చేయడానికి సోనియా గాంధీ, మన్మోహన్ దేశంలో ఎంతో సింగ్ కృషి చేసారు.