యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.కోట్లది మంది అభిమానులు ఆయన సొంతం.వాళ్లంతా వివిధ రూపాల్లో ఎన్టీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఈ కోవలోనే కుప్పం కి చెందిన లక్ష్మిపతి, హరికృష్ణ,కరీం అనే ముగ్గురు అభిమానులు ఎన్టీఆర్ ని కలవడం కోసమని కుప్పం నుంచి హైదరాబాద్ కి పాదయాత్ర.ఆరు వందల మధ్య మేర పదమూడు రోజుల క్రితం ప్రారంభమైన పాదయాత్రలో,ఆ ముగ్గురు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ ఎన్టీఆర్ మీద ఆ ముగ్గురుకి ఎంత అభిమానమో అర్ధం చేసుకోవచ్చు.మార్గ మధ్యలో మరికొంత మంది అభిమానులు ఆ ముగ్గుర్ని కలిసి అభినందించడమే కాకుండా, ఎన్టీఆర్ వాళ్ళని కలిసి యోగక్షేమాలు కనుక్కోవాలని కోరుకున్నారు.
రీసెంట్ గా ఈ ముగ్గురు పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ నివాసానికి రావడం జరిగింది. స్వయంగా ఎన్టీఆర్ తన ఇంటి నుంచి బయటకి వచ్చి రండి అబ్బాయిలు అంటూ ఆ ముగ్గుర్ని ఆహ్వానించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.వాళ్ళ పేర్లు కనుక్కొని,చెప్పులు లేకుండా వచ్చారా అని కూడా, ఆ తర్వాత ప్రేమతో ఆ ముగ్గురి భుజాల మీద ఆప్యాయంగా చేతులు వేసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని భోజనం కూడా చేయించారు.
దీంతో ఎన్టీఆర్ తన అభిమానులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మరోసారి అర్ధమైంది.ఇక ఆ ముగ్గురు అభిమానులు మాట్లాడుతు ఎన్టీఆర్ మాకు ఒక వ్యక్తి కాదని, భగవంతుడితో సమానమని తెలిపారు.