Home తాజా వార్తలు విజయోత్సవ సంబురాలు.. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

విజయోత్సవ సంబురాలు.. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహణ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
విజయోత్సవ సంబురాలు.. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహణ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • నేడు ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలకు శ్రీకారం
  • 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో సీఎం సమావేశం
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
  • 26 రోజుల వేడుకల్లో రోజుకో కార్యక్రమం
  • పరిశ్రమల ఏర్పాటుపై కంపెనీలతో ఒప్పందాలు
  • అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
  • అవగాహన కార్యక్రమాల నిర్వహణ
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలకు సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 7న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికానున్న నేపథ్యంలో నేటి నుంచి 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ వేడుకల నిర్వహణకు రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవాల నిర్వహణపై ఇదివరకే భేటీ అయిన మంత్రివర్గ ఉప సంఘం ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో సమిష్టి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేడు రోజు మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జయంతి బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్.బీ స్టేడియంలో దాదాపు 14 వేల మంది పాఠశాల విద్యార్థులతో విద్యా దినోత్సవ నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి ఈ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కాగా ఇందులో ఈ ఏడాది కాలంలో విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో మార్పులు, డైట్ చార్జీలు, రాష్ట్రంలోని అన్ని మౌలిక సదుపాయాలు, ఇంటి గ్రేటడ్ పాఠశాలలు ఏర్పాటు, పాఠశాలకు ఉచిత కరెంట్, ఇతర కార్యక్రమాలను విద్యార్ధులకు వివరించడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించనున్నారు. ఇక వేడుకల చివరి రోజైన డిసెంబరు 9న హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారుల ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్‌ ప్రదర్శనలు నిర్వహించాలని సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఎంపికైన గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే వేదికగా వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటించాలని సర్కార్ యోచిస్తున్నది. మరోవైపు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. వివిధ శాఖలకు చెందిన సంస్థతో సమవేశమై దిశానిర్దేశం చేశారు. ఈ ప్రభుత్వం చేపట్టనున్న ప్రతి కార్యక్రమం ప్రభుత్వానికి కీలకంగా మారనుంది.

మరోవైపు.. 26 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. వీటితో పాటు స్సోర్ట్స్ యూనివర్శిటీ నిర్మాణ పనులకు, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ పాన్స్ ఫోర్స్ నూ ప్రారంభిస్తారు. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు నిర్వహించారు. అందుకు సంబంధించిన పకడ్బందీ ఏర్పాట్లను ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత శాఖ కార్యదర్శులను నిర్వహిస్తున్నారు.ఈ విజయోత్సవ వేడుకల్లో భాగంగా ములుగు నిర్వహించిన కమలాపూర్‌లో మూతపడిన రేయాన్స్ పరిశ్రమలో రూ.4 వేల కోట్లతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం అధికార పార్టీ కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు చేసింది.

కాగా.. ఏడాది పాలనలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనులు అభివృద్ధి, అమలు చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం, మంత్రుల పార్టీ శ్రేణులకు చేరుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. ఐదొందలకే గ్యాస్ సిలిండర్, రెండొందల యూనిట్లలో ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలపై 26 రోజుల పాటు ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలు, దాదాపు రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతోపాటు మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాల గురించి ప్రజలకు వివరించనున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech