రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన కొద్ది రోజుల నుంచి వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఈ వ్యవహారంపై తమ నిరసనను తెలియజేశారు. గురువారం శాసన మండలి సమావేశాల ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీల శాసనమండలి చైర్మన్ పొడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ప్రభుత్వ తీర్పట్ల తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూనే.. మరోవైపు ప్రభుత్వ మంత్రులు పలు ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడితోపాటు మంత్రి నిమ్మల రామానాయుడు వివిధ శాసనమండలిలో తమ ప్రసంగాలను వినిపించారు. అయినప్పటికీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు తమ నిరసనను కొనసాగించారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తగ్గాలని, కాకపోతే నిరసనను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. అరెస్టులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మంత్రులు ప్రకటించినప్పటికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నినాదాలను కొనసాగించారు. ప్లకార్డులు పట్టుకొని వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలియజేశారు. ఒకవైపు శాసనమండలిలో అరెస్టులకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు న్యాయపరంగానూ ఈ చిక్కులను పరిష్కరించుకునేందుకు వైసిపి ప్రయత్నాలను సాగిస్తోంది. ఇప్పటికే వైసీపీ లీగల్ టీమ్ ఈ అరెస్టులను సీరియస్ గా తీసుకొని కోర్టులో కేసులు వేసేందుకు సిద్ధమవుతోంది. వైసిపి సన్నద్ధమవుతోంది. అదే
సోషల్ మీడియా అరెస్టులపై శాసనమండలిలో రగడ.. చైర్మన్ పొడియాన్ని ముట్టడించిన వైసిపి ఎమ్మెల్సీలు – Sneha News
24