- నేనో ఎంపీని నన్నెందుకు అడ్డుకుంటారు?
- కలెక్టర్ను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఉంది
- ఎంపీగా నేను పర్యటన చేయవద్దా?
- బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే శాంతి భత్ర సమస్య వచ్చిందని ముందుగా ఆయనను అరెస్టు చేయగా, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. బుధవారం నాడు కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఉండటానికి డీకే అరుణ బయలుదేరారు. ఈ విధంగా మార్గమధ్యలో మన్నెగూడ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎంపీ డీకే అరుణ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను అపాయింట్ మెంట్ తీసుకుని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ని కలెక్టర్ ను కలిసేందుకు పంపించి తనను ఆపివేశారని ఆమె ముఖ్యమంత్రి. ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు తనకుందని అన్నారు. తామేమైనా లా అండ్ ఆర్డర్ ను బ్రేక్ చేసే పని చేశామా? అని ఆమె ప్రశ్నించారు.