Home తాజా వార్తలు ఫిరాయింపు కేసులో తీర్పే తరువాయి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ఫిరాయింపు కేసులో తీర్పే తరువాయి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ఫిరాయింపు కేసులో తీర్పే తరువాయి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో విచారణ పూర్తి చేసిన హైకోర్టు
  • అనర్హత పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ
  • తీర్పును రిజర్వు హైకోర్టు చేసిన
  • కీలక తీర్పుపై రాజకీయ ఉత్కంఠ
  • ఇప్పటికే సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి సవాల్
  • స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవద్దని పిటిషన్
  • గతంలో ఆగ్రహించిన హైకోర్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అపెంబ్లీ కార్యదర్శి వీ.నరసింహాచార్యులు మంగళవారం అప్పీలుపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరుపున న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇందులో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పిల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని గండ్ర మోహన్ రావు చెప్పారు. ఈ కేసుపై సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అనర్హత పిటీషన్‌పై సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాద్యత స్పీకర్‌కు వాదించారు. ఇటు మయూర్ రెడ్డి సైతం అనర్హత వేటు వేసే విషయంలో పునరాలోచన చేశారు.

ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మరింత విచారణ చేపట్టకుండా తీర్పును రిజర్వ్ చేసింది. ఇదీలావుంటే.. ఫింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్‌ ఖరారు చేయాలని గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. అయితే సింగిల్‌ బెంచ్‌ తీర్పు డివిజన్‌ ​​బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి సవాల్‌ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇదే కేసులో పార్టీ ఫిరాయింపులకు హాజరైన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులు జారీ చేసినట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వరరెడ్డి తరపు సీనియర్‌ న్యాయవాది జే.ప్రభాకర్‌రావు తన వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. మరో వైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో, సభ ఓటింగ్‌లో గానీ పాల్గొనకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై విజ్ఞప్తిని హైకోర్టు ఇంతకుముందే తోసిపుచ్చింది. అనర్హత పిటిషన్లపై తేల్చకుండా ఇలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రకటన. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, శ్రీహరి ల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech