Home తెలంగాణ అంతా ప్లాన్ ప్రకారమే..! ముందుగానే రాళ్లు, కారంపొడి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

అంతా ప్లాన్ ప్రకారమే..! ముందుగానే రాళ్లు, కారంపొడి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
అంతా ప్లాన్ ప్రకారమే..! ముందుగానే రాళ్లు, కారంపొడి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ముందస్తు ప్రణాళిక ప్రకారమే వేదిక మార్పు
  • ప్రధాన నిందితుడు సురేష్
  • మొత్తం 46 మంది నిందితులు
  • 16 మంది అరెస్ట్
  • లగచర్ల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :- వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇందులో భాగంగానే ముందుగానే రాళ్లు, కర్రలు, కారం పొడిని సిద్దం చేసి దాడికి పాల్పడినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు గుర్తించారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయడానికి ప్రధాన నిందితుడు సురేష్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు రిపోర్ట్‌లో తేల్చారు . ఈ దాడికి నిందితులపై సెక్షన్ పోలీసులు 61(2),191 (2)(3),132,109,121(1),126 (2),324(4)రెడ్ విట్ 190, సెక్షన్ 3PDPP యాక్ట్, సెక్షన్ 128 బీఎస్‌ఎస్ కింద కేసులు నమోదు చేశారు.

46 మంది నిందితులు

లగచర్ల ఘటన కేసులో 46 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సురేష్‌ పేరును ప్రస్తావించారు. దాడి చేసిన 46 మందిని గుర్తించి, వాళ్లపై వివిధ సెక్షన్-3 కింద కేసులు నమోదు చేశారు. 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు. పరారీలో ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు మరో 29 మంది ఉన్నారు. భోగముని సురేష్‌రాజ్ కలెక్టర్ వద్దకు వచ్చి సమావేశానికి రైతులు ఎవరూ రారని, మీరే మా గ్రామానికి రావాలని కోరారు. దీంతో అధికారులు అంతా లగచర్ల గ్రామానికి చేరుకున్నారు. ప్రజాభిప్రాయం గ్రామంలోకి వెళ్లిన అధికారులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అడిషనల్ కలెక్టర్ లింగనాయక్, ఇంచార్జ్ కలెక్టర్ ఉమాశంకర్, దుద్యాల్ తహసిల్దార్ కిషన్ నాయక్ జయకుమార్ కొడంగల్ తహసిల్దార్ విజయనాయక్ వెళ్లారు.

ఆ తర్వాత వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి సమావేశానికి వచ్చారు. రైతులతో అధికారులు మాట్లాడటానికి ప్రయత్నించగా ఒకేసారి మెరుపు దాడి చేశారు. రాళ్లు, కర్రలతో అధికారులను వెంబడించి మరీ దాడి చేశారు. కలెక్టర్‌ని అడ్డగించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్లు విసిరి, ఆపై దాడికి దిగారు. కడ ఆఫీసర్‌పై మూకుమ్మడిగా రాళ్లు, కర్రలు దాడి చేశారు. ఆ తర్వాత కారంపొడితో విసిరారు. దాని నుంచి తప్పించుకున్న అధికారి, స్థానిక ప్రైమరీ స్కూల్‌లో తల దాచుకున్నారు. స్కూల్లోకి చొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు కాపాడారు. అడిషనల్ కలెక్టర్, కడ స్పెషల్ ఆఫీసర్‌పై హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో అధికారులు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ విష‌యాల‌లో పోటీ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech