Home తాజా వార్తలు ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకో కేసీఆర్.. ఇక నీ దుకాణం బంద్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకో కేసీఆర్.. ఇక నీ దుకాణం బంద్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకో కేసీఆర్.. ఇక నీ దుకాణం బంద్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • తెలంగాణ సమాజం నిన్ను మరచిపోయింది
  • ఇప్పటికైనా మంచి పనులకు మద్దతు ఇవ్వండి
  • బడి ఎగ్గొట్టినట్లు అసెంబ్లీకి రావడం లేదు
  • తెలంగాణ ఏం కోల్పోలేదు
  • కేసీఆర్ ఇంట్లో నాలుగు ఉద్యోగాలు తప్పవు
  • కొందరు సారాబుడ్లతో దీపావళి చేసుకున్నారు
  • రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల కోసం పాలసీ తీసుకువస్తాం
  • ఏఎంవీఐలకు నియామక పత్రాల జారీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : మాజీ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ సమాజం మరిచిపోయిందని, ఆయన ఇక ఫాంహౌస్‌కే పరిమితం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దుకాణం బంద్ అయింద’న్నారు. `బడికి ఎగ్గొట్టే వారిని చూస్తే ఉంటాం.. కానీ తెలంగాణలో అసెంబ్లీకి ఎగ్గొట్టి ఇంటికి పరిమితమయ్యే వారిని చూస్తున్నాం. ఇదేనా ప్రజలు మీకు ఇచ్చిన భాధ్యత.. మీ పని అయిపోయింది.. తెలంగాణ సమాజం మొత్తం ఎప్పుడో మరిచిపోయింది..“అంటూ మాజీ కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సెటైరికల్ సీఎం కామెంట్స్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, పలువురు ముఖ్య అతిథులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేసిన అనంతరం సీఎం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ యువత, ఉద్యోగాలను సాధించుకోవాలన్న లక్ష్యంతో సాధించుకున్నారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు కల్పన కల్పించే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది, వారి గురించి ఆలోచించిన పరిస్థితి. దీనితో తాను ఎన్నికల సమయంలో మిమ్మల్ని నమ్మించిన వారి ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చానని, అధికారంలోకి వచ్చిన మరుక్షణం 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రూప్-1 పరీక్షను తెలంగాణలో 12 ఏళ్లుగా నిర్వహించలేదని, తమ ప్రభుత్వం వచ్చిన అనంతరం 563 ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఎన్ని కష్టాలు ఎదురైనా చిట్టచివరకు పరీక్షలను విజయవంతంగా నిర్వహించామన్నారు.

గ‌త పాల‌కులు గుర్తు లేరు

ఇక మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. బడికి ఎగ్గొట్టే వారిని చూసి ఉంటామని, కానీ నేడు ప్రజలు ఇచ్చిన బాధ్యతను కూడా మరిచి అసెంబ్లీకి రాని వారిని తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. అసెంబ్లీకి రావాలని తాము పదేపదే కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణ సమాజం గత పాలకులను ఎప్పుడో మరిచిపోయిందంటూ. కొంతమంది దీపావళి పండుగ రోజు చిచ్చుబుడ్లకు బదులుగా, సారా బుడ్లతో దీపావళి పండుగను జరుపుకుంటున్నారని, ఇటువంటి వారిని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు. కేసీఆర్ వాస్తు కోసం సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకుండు కానీ.. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కటి కూడా నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి వారు ఆదర్శమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ ఆచారి ఇషాంత్ రెడ్డి వారిని ఆదర్శంగా తీసుకోవాలా లేదా అన్నది తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. పక్క రాష్ట్రాల నుండి వస్తున్న గంజాయి రవాణాను అడ్డుకోవడంలో శాఖ రవాణా కీలకపాత్ర పోషించిందని, నూతన ఉద్యోగాలకు ఎంపికైన వారు తమ విధి నిర్వహణలో, మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలన్నారు.

ఏం కోల్పోలేదు.. మీ ఉద్యోగాల తప్ప

ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని, కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం తనకు సంతృప్తిని ఇస్తోంది. 10 మందిలో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారని, తెలంగాణ ఏం కోల్పోలేదని, ఆ పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఒక్కటైనా కట్టిందా అని ప్రశ్నించారు.

రెసిడెన్షియల్‌ స్కూల్‌ కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారని అన్నారు. 2011లో రాష్ట్రంలో చివరిసారిగా గ్రూప్‌-1 నిర్వహించారని దాదాపు 13 ఏళ్లపాటు గ్రూప్‌-1 నిర్వహించినట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా పట్టుబట్టి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించానని త్వరలో గ్రూప్‌-1 నియామకపత్రాలు అందజేస్తానని తెలిపారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికినా మమ్మల్ని పట్టుకోవద్దని దబాయిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో కొందరు మద్యం సేవించి దీపావళి చేసుకుంటున్నారని, చిచ్చుబుడ్లకు బదులు సారాబుడ్లతో కొందరు దీపావళి జరుపుకుంటున్నారని సెటైర్లు వేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech