33
తమిళ సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ (ఢిల్లీ గణేష్) కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న గణేష్.. ఆదివారం తెల్లవారుజామున చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఢిల్లీ గణేష్ 400 కి పైగా చిత్రాలలో నటించారు. ఈ ఏడాది ‘అరణ్మనై 4′(బాక్), ‘ఇండియన్-2’ చిత్రాల్లో కనిపించారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలోనూ నటించారు. ఢిల్లీ గణేష్ మరణ వార్తతో కోలీవుడ్ లో విషాదం. వివిధ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.