- ప్రాజెక్టులను కేకు ముక్కలుగా పంచుతున్న రేవంత్ సర్కార్
- నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనులు మేఘా, రాఘవ కన్ స్ట్రక్షన్స్ కు అప్పగిస్తారా?
- ప్రాజెక్ట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు
- ఎల్ ఆంట్ టి, ఎన్ సిసి లాంటి కంపెనీలకోమే మొండిచెయ్యి
- సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘాను ప్రభుత్వం ఇంకా ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదు
- కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ పనుల మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ సంస్థలకు కట్టబెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరితెగించి అవినీతికి పాల్పడ్డారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి, మేఘా సంస్థకు ఈ టెండర్లు దక్కేలా చేయమంటేనే నీకిది-నాకది అని క్రోని క్యాపిటలిజానికి అడ్డుగా….. అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని అన్నారు. ఎల్ అండ్ టి, ఎన్‌సి లాంటి పెద్ద కంపెనీలకు టెండర్లు దక్కకుండా కావాలనే కుట్ర చేసిందన్నారు. ఎల్ అండ్ డి, ఎన్ సిసి సంస్థలను టెక్నికల్ రీజన్స్ పేరు చెప్పి డిస్క్ క్వాలిఫై చేస్తున్నప్పుడు….. నియంత్రణలో ప్రజలు ఏమనుకుంటారోనన్న సోయి తప్పి సిగ్గులేకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలాగైన మేఘా, రాఘవ సంస్థలకు ఈ ప్రాజెక్ట్ కట్టబెట్టాలని చేసిన తప్పుడు ప్రయత్నాలను మీరు గమనిస్తున్నారు. ఈ రెండు సంస్థలు చెరి సమానం కేక్ ను పెంచుకున్నట్లు 3.9 శాతం, 3.95 శాతం పంచుకునే విధంగా బిడ్ లు వేయమంటే ఇందులో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఇంత బరితెగించి అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారన్నారు.
సుంకిశాల లో ప్రమాదం కారణంగా ప్రభుత్వానికి రూ. 80 కోట్లు నష్టం చేసిన మేఘా కంపెనీకి పనులను ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని హైదరాబాద్‌మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎందుకు మేఘా మీద రేవంత్ రెడ్డికి అంత ప్రేమ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా, ఆంధ్రా కంపెనీ అంటూ ఏ మేఘా కంపెనీపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడో ఇప్పుడు అదే కంపెనీకి సిగ్గులేకుండా ఎందుకు ప్రాజెక్ట్ పనులు అప్పగించారో చెప్పాలన్నారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన కంపెనీకి రేవంత్ రెడ్డి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను బహుమానంగా ఇవ్వటం వెనుక భారీ అవినీతి కుంభకోణం ఉందని కేటీఆర్ అన్నారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలు, రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేవన్న రేవంత్ రెడ్డి…ఇంత ఖర్చుతో ఎవరి జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రజలు మీ చేతగాని పాలనలో బాధపడుతుంటే…మరో వైపు మీరు మాత్రం ప్రజాధనాన్ని లూటీ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం రూ. 4,350 కోట్ల ఈ ప్రాజెక్ట్ ను మేఘా, రాఘవ సంస్థలకు అప్పగించి వారి ద్వారా వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు అప్పగిస్తే వాళ్లు దేశ వ్యాప్తంగా తమ పార్టీ ఖజానా నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేఘా, రాఘవ కన్ స్ట్రక్షన్ అవినీతి బాగోతాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని…మీ అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేటీఆర్ హెచ్చరించా