23
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జలవివాదం.. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా.. అక్కడి ఏపీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అంతే గాకుండా తెలంగాణ అధికారులకు ఇక్కడ ఏం పని అంటూ.. అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో, అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, గతంలో ప్రభుత్వాల్లో కూడా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొంది.