Home సినిమా క్రిష్ డైరెక్టర్ పెళ్ళాడుతున్న ప్రీతి బ్యాక్ గ్రౌండ్ తెలుసా? – Sneha News

క్రిష్ డైరెక్టర్ పెళ్ళాడుతున్న ప్రీతి బ్యాక్ గ్రౌండ్ తెలుసా? – Sneha News

by Sneha News
0 comments
క్రిష్ డైరెక్టర్ పెళ్ళాడుతున్న ప్రీతి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?


గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు క్రిష్ జాగర్లమూడి (క్రిష్ జాగర్లమూడి). ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’, అనుష్కతో ‘ఘాటి’ సినిమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఉండటంతో ‘హరి హర వీరమల్లు’ బాగా ఆలస్యమైంది. దీంతో మిగిలిన షూటింగ్ పూర్తి చేసే బాధ్యతను యువ దర్శకుడు జ్యోతి కృష్ణకు అప్పగించి, తాను ‘ఘాటి’తో బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే తన వ్యక్తిగత జీవితంలో క్రిష్ త్వరలోనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు.

గతంలో క్రిష్.. డాక్టర్ రమ్యను పెళ్లి చేసుకొని, మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఇప్పుడు ఆయన రెండో పెళ్లి కూడా డాక్టర్ నే చేసుకోబోతున్నట్లు. హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ ప్రీతి చల్లా(ప్రీతి చల్లా) ను ఈ నెల 10న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. 16న రిసెప్షన్ జరగనుందట. ఈ రిసెప్షన్ కి సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

ప్రీతి చల్లా అమీర్ పెట్ లోని జాయ్ హాస్పిటల్ లో గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ప్రీతికి కూడా ఇది రెండో పెళ్లే. ఆమెది డాక్టర్ల కుటుంబం. ప్రీతి తల్లి, ఉమా చల్లా కు సీనియర్ గైనకాలజిస్ట్ గా ఎంతో పేరుంది. ప్రీతి తండ్రి, సోదరుడు కూడా డాక్టర్లే ​​కావడం విశేషం. గతంలో వీరి కుటుంబం చల్లా హాస్పిటల్ ను నిర్వహించేది. ఇప్పుడే జాయ్ హాస్పిటల్ గా మారింది.

క్రిష్ గుంటూరు కాగా, ప్రీతి కుటుంబం కూడా గుంటూరుకు చెందినవారే అని తెలుస్తోంది. ఫ్రెండ్స్ కావడంతో పాటు, ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. ఆ బంధుత్వమే ఇప్పుడు వీరి పెళ్లికి బాటలు వేసిందని వినికిడి.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech