హీరోకైనా, హీరోయిన్కైనా ఒక్క సినిమాతోనే క్రేజ్ వచ్చేస్తే.. ఆ తర్వాత వచ్చే సినిమా దాన్ని నిలబెట్టేలా ఉండాలి. అప్పుడే వారికి సరైన స్టార్‌డమ్ వస్తుంది. కానీ, కొందరి విషయంలో అలా జరగదు. ఒకే ఒక్క సినిమాతో ఎక్కడా లేని క్రేజ్ సంపాదించుకున్న వారు ఆ తర్వాత చేసే సినిమాలతో ఒక్కసారిగా జీరోకి వచ్చేస్తారు. అలాంటి ఓ విచిత్రమైన హీరోయిన్ పరిస్థితి రుక్మిణీ వసంత్‌కి వచ్చింది. కన్నడలో రూపొందించిన ‘సప్త సాగరాలు దాటి’ గత ఏడాది తెలుగులో విడుదలైంది. ఈ సినిమాతో రుక్మిణీ వసంత్‌కి ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. అప్పటికే తమిళ్‌లో ఆమెకు క్రేజీ ఆఫర్ వచ్చింది. తెలుగులో ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోల సరసన ఆమె కోసం చర్చలు కూడా జరిగాయి.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో సంపాదించుకున్న పాపులరిటీ మళ్ళీ ఒక్క సినిమాతో తగ్గిపోయింది. ఘనత సాధించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. నిజానికి రుక్మిణీ వసంత్ మొదటి సినిమా ఇదే. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి’ మొదటి సినిమాగా రిలీజ్ అయింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సూపర్‌హిట్ అయి ఉంటే రుక్మిణి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ, అలా జరగలేదు. టాలీవుడ్‌లో స్టార్‌గా దూసుకుపోదామన్న ఆమె కలలకు నిఖిల్ బ్రేక్ వేశాడు.
ఈ సినిమాకి సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్లే ఓపెనింగ్స్ కూడా బలహీనంగా ఉన్నాయని. ఓటీటీ కోసం ఎంతో హడావిడిగా ఈ సినిమాను విడుదల చేశారు. సాధారణంగా నిఖిల్ సినిమాలకు ప్రమోషన్స్ విపరీతంగా చేస్తారు. కానీ, ఈ సినిమా విషయానికి వస్తే.. నిల్ అనే చెప్పాలి. హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఇంటర్వ్యూ కూడా ఒక్కరోజు ముందు మీడియాకు వదిలారు. ఇలాంటి అతి బలహీనమైన ప్రమోషన్స్ వల్ల ఏ సినిమా అయినా బ్రతికి బట్ట కట్టగలదు. ఈ సినిమాకి కూడా అదే జరిగింది. నిఖిల్ నటించిన సినిమాల్లో ఘోరమైన టాక్‌తో, అతి బలహీనమైన ఓపెనింగ్స్‌తో రిలీజ్ అయిన సినిమా ఇదే.