19
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హ’త’కు సంబంధించిన కేసులో హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయ వాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు పలు కోర్టుల తీర్పులను మోహన్ రావు చదివి వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.