ముద్ర, తెలంగాణ బ్యూరో :- హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసులు అమానుషంగా దాడి చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం కోరితే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పోలీసులు విచక్షణరహితంగా దాడి చేస్తారా? అని నిలదీశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులపై కూడా దాడికి తెగబడటమేనా ఇందిరమ్మ రాజ్యమంటే? అని ఉంది.ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగానీ దద్దమ్మ రేవంత్ సర్కార్…అడిగిన వారిపై దాడులు చేసే సంస్కృతికి తెరలేపిందని ధ్వజమెత్తారు. పెద్ద ప్రభుత్వాల మెప్పు పొందేందుకు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే…మేము వచ్చాక తప్పకుండా మిత్తితో చెల్లిస్తామని చెప్పారు. కౌశిక్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పడు నిలదీస్తున్న కౌశిక్ రెడ్డి పై రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడన్నారు.
ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గాంధీ తో గుండాగిరి చేయించి కౌశిక్ రెడ్డిపై దాడి చేసి ప్రయత్నం చేశాడన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఈసారి పోలీసుల ద్వారానే రేవంత్ రెడ్డి దాడికి పాల్పడ్డాడని. ప్రశ్నిస్తే భయపడి దాడులకు ఎప్పుడూ పాల్పడే ఇంత పిరికి ప్రభుత్వాన్ని చూడడానికి. కౌశిక్ రెడ్డి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ సైనికులెవరు భయపడుతున్నారు.కౌశిక్ పై చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు….. పోలీసులు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.