నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ నిర్వహించారు
సంగీతం: తేజ్
డీఓపీ: గిరి
ఎడిటింగ్: విప్లవ్
ఆర్ట్: దండు సందీప్ కుమార్
రచన- దర్శకత్వం: విప్లవ్
నిర్మాత: విప్లవ్
విడుదల తేదీ: నవంబర్ 8, 2024
విప్లవ్ హీరోగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా రూపొందించిన సినిమా ‘ఈసారైనా’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ:
డిగ్రీ పూర్తయ్యి నాలుగేళ్లు అవుతున్నా ఉద్యోగం చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రాజు (విప్లవ్). అదే ఊరిలో శిరీష (అశ్విని) గవర్నమెంట్ టీచర్ గా జాబ్ చేస్తుంది. మరో మూడుసార్లు నోటిఫికేషన్ వచ్చినా ఉద్యోగం సాధించలేకపోతాడు రాజు. ఎలాగైనా ఉద్యోగం సాధిస్తావంటూ రాజుని.. అతని స్నేహితుడు మహబూబ్ బాషా, ప్రేయసి అశ్విని ఎంకరేజ్ చేస్తారు. అశ్విని తండ్రి (ప్రదీప్ రాపర్తి) మాత్రం నీకు గవర్నమెంట్ జాబ్ వస్తేనే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. మరి రాజు గవర్నమెంట్ జాబ్ సాధించాడా? జాబ్ తెచ్చుకొని తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కథ చిన్నదే అయినా, ఉన్నంతలో అందంగా తీసి మెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విప్లవ్. పల్లెటూరులో అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాని తీశారు. దాంతో సినిమా చూస్తున్నప్పుడు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. విప్లవ్, అశ్విని మధ్య లవ్ ట్రాక్, రొమాంటిక్ సీన్స్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఓ వైపు హీరో లక్ష్యం, మరోవైపు ప్రేమ. ఆ వస్తువులని ముడిపెడుతూ నడిచే కథనం. ఈ వంటి వచ్చే సన్నివేశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మెప్పించాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఏ గాయమో సాంగ్ ఇన్స్పైరింగ్ గా ఉంది. అయితే ఈ సినిమాలో కొన్ని మైన్స్ పాయింట్స్ ఉన్నాయి. నిడివి తక్కువే అయినా, అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. సీన్స్ ని మరింత ఎఫెక్టివ్ గా రాసుకొని ఉండాల్సింది.
విప్లవ్ హీరో గానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్ గా అన్ని తానై సినిమాని రూపొందించడం అభినందించదగ్గ విషయం. అయితే రైటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకొని ఉంటే, అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. గిరి కెమెరా పనితనం, తేజ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ, తన ప్రేమను గెలిపించుకోవాలని తపనపడే పల్లెటూరి యువకుడి పాత్రలో విప్లవ్ చక్కగా రాణించాడు. అశ్విని స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ బాగా ఉన్నాయి. అశ్విని తండ్రి పాత్రలో ప్రదీప్ రాపర్తి మెప్పించారు. హీరో స్నేహితుడిగా మహబూబ్ బాషా బాగానే నవ్వించాడు. చిన్నప్పటి పాత్రలో సలార్ కార్తికేయ దేవ్, హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నీతు సుప్రజ నటన ఆకట్టుకుంది. సత్తన్న, అశోక్ మూలవిరాట్ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైనల్ గా చెప్పాలంటే..
పచ్చని పల్లెటూరులో అందమైన లొకేషన్స్ లో తీసిన, ప్రశాంతంగా అనిపించే యూత్ ఫుల్ లవ్ స్టోరీ ‘ఈసారైనా?!’. అంచనాలు పెట్టుకోకుండా చూస్తే.. ఈ సినిమా నచ్చే అవకాశముంది.
రేటింగ్: 2.5/5