Home తాజా వార్తలు ఆన్‌లైన్ బిజినెస్ పై ఈడీ ఫోకస్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ఆన్‌లైన్ బిజినెస్ పై ఈడీ ఫోకస్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ఆన్‌లైన్ బిజినెస్ పై ఈడీ ఫోకస్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • హైదరాబాద్ సహా పలు ప్రాంతాల తనిఖీలు
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ దృష్టి
  • 19 ప్రాంతాలు సోదాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేకుండా ఫ్లిప్‌ట్‌, అమెజాన్ లాంటి అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి.. విక్రయదారులపై ఈడీ దాడులు చేసింది. విదేశీ పెట్టుబడుల నిబంధనలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఇ) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులు విక్రయించే వ్యాపార సంస్థలపై ఈడీ తనిఖీలు చేపట్టింది. దేశంలో 19 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, గురుగ్రామ్, పంచకులలోని 19 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. ఓడరేవుల నుంచి కాకుండా వేరే వేర మార్గాల ద్వారా చైనా వస్తువులను తీసుకొచ్చి దేశంలో విక్రయిస్తున్నారని వారికి సమాచారం ఉంది. అందుకే ఈ తనిఖీలు చేపట్టారు. ఓడ రేవుల్లో భద్రత పటిష్టంగా ఉంటుందని ఎక్కువ సమయం పడుతుందని అందుకే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరకులను తీసుకొస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఒప్పందం ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్టు, అమెజాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తమకు రిలేటెడ్ సంస్థల్లో సోదాలు జరగనుందని అవి స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లలో కొందరు అమ్మకందారులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల ధరలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నాయి. ఇ-కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎలాంటి అనుమతి లేదు. మార్కెట్‌ ప్లేస్ మోడ్‌లో పని చేసే ఫ్లిప్‌కార్డు, అమెజాన్ కంపెనీలు తమ వద్ద ఎలాంటి సరకును ఉంచుకోకుండా అమ్మకందారులకు ప్లాట్‌ఫామ్ సర్వీస్ మాత్రమే అందిస్తారు.

ఆఫ్‌లైన్ బీ2 స్టోర్‌ల్లో మాత్రం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. ఇక్కడ కూడా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి ఉంది. ఈ కామర్స్ సంస్థ పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థల్లో వాటాలు ఉండకూడదు. ఇక్కడ అమ్మకందారుల వస్తువులు 25శాతానికి మించి స్టోర్ చేయడానికి వీలు లేదు. ఏమైనా డిస్కౌంట్లు ఉంటే నేరుగా ఎవరైతే అమ్మకందారులు ఉంటారో వాళ్లే ఇవ్వాలి కానీ ఈ కామర్స్ వాళ్లు కాదు. ఈ రూల్స్ అతిక్రమించి కొందరు అమ్మకందారులు ఇష్టరాజ్యంగా చేస్తున్న ఆరోపణలపై ఈడీ తనిఖీలు చేసింది. అందులో భాగంగా ఆరుగురు విక్రయసంస్థల వద్ద దస్త్రాలు స్వాధీనం చేసుకున్న సమాచారం. ఎప్పటి నుంచో ఈ సమస్యపై గళం ఎత్తుతున్న సిఎఐటి తనిఖీలను ఆహ్వానించింది.

గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమ్మకందారులకు ఫైన్ ఎందుకు వేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ప్రజలకు నష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్న ఫ్లిప్‌కార్డు, అమెజాన్ కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ సీఐఐలో సీఐఐటీ, మెయిన్‌లైన్ మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ పిటిషన్లు వేశాయి. ఎఫ్‌డీఐ ఉల్లంఘనలే కాకుండా, వ్యతిరేక పోటీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలని సీసీఐకి ఈడీని సూచిస్తోంది. ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ వల్ల చిన్న వ్యాపారాలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో ఈడీ రంగంలోకి దిగి అసలు గుట్టు రట్టు చేసే పనిలో పడింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech