ప్రముఖ వివాదస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి(venu swamy)కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత లు పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే విడిపోతారని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.దీంతో వేణుస్వామి పై ఎన్నో విమర్శలు రావడంతో పాటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ ల సంఘం కూడా ఆయన మీద కేసు నమోదు చేసింది.
దీంతో ఇప్పుడు జర్నలిస్టుల సంఘం లేవనెత్తిన ఆరోపణల దృష్ట్యా తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 ఉదయం పదకండు గంటలకి కమీషన్ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో తెలియజేసారు. ఈ విషయాన్నీ మహిళా కమీషన్ చైర్మన్ శారద నేరెళ్ల సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
కొన్ని రోజుల క్రితం మహిళా కమీషన్ తనని విచారించడానికి వీలు లేదని వేణుస్వామి హైకోర్ట్ లో వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మహిళా కమీషన్ కి వేణు స్వామిని విచారించడానికి పూర్తి అధికారాలున్నాయని, వారం రోజుల్లో వేణు స్వామి పై తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ని కోర్టు ఆదేశించింది.