- డాక్టర్ చదువుకు డబ్బులు లేక కూలి పనులకు….
- ఆర్థిక స్తోమత లేని గౌతమికి వైద్య విద్య అందని ద్రాక్షపండేనా?
- తమ మనవరాలు వైద్య విద్య చదవడానికి దాతల సహాయం చేస్తున్న తాత నానమ్మ
తుంగతుర్తి ముద్ర :- పాఠశాల విద్యా స్థాయి నుండి పేదింటి బిడ్డగా పెరిగిన గౌతమి నేడు మంచిర్యాల వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిగా స్థానం సంపాదించినా ఆర్థిక స్తోమత లేక డాక్టర్ కావాలన్నా తన కల నెరవేరేనా….వైద్యురాలు కావాలన్నది ఆ బిడ్డ తపన .అందుకోసం ఒక పక్క కూలి పనులు చేస్తూనే మరో పక్క కష్టపడి చదివింది. నీట్ లో 507 మార్కులు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రావడంతో కనీసం పుస్తకాలు వెళతాయి , దుస్తులు మరియు ఫీజులకు డబ్బులు లేక డాక్టర్ విద్య తనకు అందని ద్రాక్ష పండే నా అనుకుని ఎప్పటిలాగే తాత, నానమ్మలతో కూలి పనులకు వెళుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి చిన్నతనంలోనే వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించడం తల్లి దూరం కావడంతో ఆమె బాగోగులను తాత శిగ రాములు, నాయనమ్మ వెంకటమ్మలు చూసుకునేవారు.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి, ఆ తర్వాత పది మరియు ఇంటర్ మీడియట్ వరకు పసునూర్ ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి మరియు ఇంటర్ కాలేజీలోనే టాపర్ గా నిలిచి కళాశాలకే ఆదర్శంగా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో మొదటి ప్రయత్నంలోనే నీట్ పరీక్షకు హాజరై దంత వైద్య కళాశాలలో సీట్ సాధించారు .దంత వైద్యురాలు కావాలనే కోరిక లేక మళ్లీ నీట్ రాయాలనుకున్న గౌతమి ఆర్థిక సమస్యలు గుదిబండగా మారాయి. అయినప్పటికీ నానమ్మ పుస్తెలతాడు తాకట్టుపెట్టి హైదరాబాదులో కోచింగ్ కు పంపి మరో ప్రయత్నం చేసి మెరుగైన ర్యాంకు సాధించి ఇటీవల ఎంబిబిఎస్ కౌన్సిలింగ్ లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు స్థానంలో ఉంది. ఆమె లక్ష్యం నిరుపేదలకు వైద్యం అందించడమే తమ ధ్యేయంగా తల్లిదండ్రులు దూరమైన పదో తరగతిలో 10/10, ఇంటర్మీడియట్ బైపిసిలో 922/1000 మంచి మార్కులు సాధించిన గౌతమి డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఏడాదిగా తాత-నానమ్మలతో పాటు కూలి పనులకు వెళుతూనే నీట్ పరీక్షలకు సిద్ధమైంది.
నీట్లో 507 మార్కులు ( 1,92,000 )ర్యాంకు సాధించడంతో గౌతమి ఆలనా పాలనా చూసిన తాత నానమ్మలు సంతోషించారు. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు లభించడం, చదువుకోవడానికి ఏటా 50,000 ఖర్చు అవుతుందని ఆర్థిక స్తోమత లేకపోవడంతో చేసేది లేక కూలి పనులకు వెళ్లాల్సి వస్తుంది .ఆస్తులు అమ్మి ఫీజు కడదాం అనుకున్నవి ఏమీ లేకపోవడంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశ నెరవేరుతుంది తాత నానమ్మలు. నిరుపేద వైద్య విద్యార్థికి హాస్టల్ ఇతరత్రా ఖర్చులకు సంవత్సరానికి లక్షన్నర అవసరం కావడంతో ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మనసున్న దాతలు తోచిన సహాయం చేయడానికి పేదింటి వైద్య విద్యార్థిని మంచి మనసున్న మారాజులను వేడుకొంటుంది. సహాయం చేయాలనుకున్న మనసున్న దాతలు వారి మేనత్త ఫోన్ పే నెంబర్ 9398919127 నిరుపేద వైద్య విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి ఉదారత చాటుకోవాలని తాత నానమ్మలు కోరుకుంటున్నారు.