ముద్ర, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డు జారీకి సంబంధించి నూతన విధి విధానాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీనియర్ పాత్రికేయుల కమిటీ సమావేశమైంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సమాచార భవన్ లో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి కమిటీ సమావేశమై జర్నలిస్టులకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అక్రెడిటేషన్ కార్డు జారీకి రూపొందించాల్సిన నూతన నియమాలు, నిబంధనలపై చర్చించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఎస్.హరీష్, సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్, ది హిందూ పొలిటికల్ ఎడిటర్ ఆర్ రవికాంత్‌రెడ్డి, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్, నవ తెలంగాణ పత్రిక సీనియర్ ఫోటో గ్రాఫర్ నరహరి, సమాచార శాఖ ఇన్ చార్జ్ డైరెక్టర్ జగన్‌లు ఉన్నారు.