2
- దేశ గణనలో తెలంగాణను పరిగణలోకి తీసుకోమని చెప్పండి
- గవర్నర్ కు సీఎం రేవంత్ విజ్ఙప్తి
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణంలో తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేణు పరిగణలోకి తీసుకునే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన దేశానికే దిక్యూచీగా, ఆదర్శంగా నిలవనున్నట్లు చెప్పారు. బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ అయిన సీఎం రాష్ట్రంలో ప్రారంభమైన సర్వే తీరును వివరించారు. అలాగే తన సోదరుడి కూతురు వివాహానికి రావాలని సీఎం గవర్నర్ ను ఆహ్వానించారు.సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్త అమిత్ రెడ్డి ఉన్నారు.