అమరావతి, ఈవార్తలు : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో.. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. వాటితో పాటు.. పిఠాపురం హెడ్ క్వార్టర్‌గా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు.. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లుకు అంగీకారం. ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్ గా నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం లభించింది.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో 2014-2019 మధ్య పూర్తైన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించేందుకు ఓకే చెప్పింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీవిరమణ వయసును 60 నుంచి 61కి పెంచేందుకు కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక.. పల్నాడు పరిధిలోని 6 మండలాలు, 92 గ్రామాలు.. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 1,069.55 చదరపు చదరపు విస్తీర్ణ ప్రాంతం.. బాపట్ల పరిధిలోని ఐదు మండలాలు, 62 గ్రామాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇక.. పోస్ట్‌మెట్రిక్ డాడ్‌షిప్‌లను నేరుగా విద్యార్థుల కాలేజీల బ్యాంక్ అకౌంట్లకు పంపేలా నిర్ణయం తీసుకుంటూ చంద్రబాబు కేబినెట్ ఆమోదం జారీ.
కెనడాతో విభేదాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నారా.. తినాల్సిన ఆహార పదార్థాలివే..