Home తాజా వార్తలు ముగిసిన హోరాహోరీ ప్రచారం!..అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే ! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ముగిసిన హోరాహోరీ ప్రచారం!..అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే ! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ముగిసిన హోరాహోరీ ప్రచారం!..అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే ! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



న్యూయార్క్, నవంబర్ 4: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగుతున్నాయి.సుమారు పాతిక కోట్ల మంది అమెరికన్ ఓటర్లు తమ నలభై ఏడవ అధ్యక్షుని ఎన్నుకోవడం కోసం సిద్ధం అవుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి పోలింగు ప్రారంభం కానున్నది.

అధ్యక్ష ఎన్నికల బరిలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ జే ట్రంప్ మధ్య తీవ్రపోటీ నెలకొంది.వారిద్దరితో పాటు గ్రీన్ పార్టీ అభ్యర్థిని జిల్ స్టెయిన్ కానిస్టిట్యూషన్ పార్టీ అభ్యర్థి రెండాల్ టెరీ , స్వతంత్ర అభ్యర్థి కార్నెల్ వెస్ట్ వంటివారు కూడా పోటీలో ఉన్నారు.

జాన్ ఎఫ్ కెన్నెడీ మనుమడు జూనియర్ కెన్నెడీ పోటీ చేసినా ఆఖరు నిముషంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు.అమెరికాలో అమల్లో ఉన్న ఎన్నికల విధానం ప్రకారం ఓటర్లు పోలింగు తేదీ వరకూ ఆగాల్సిన అవసరం లేకుండా నాలుగు వారాల ముందునుండే వారికి అనువైన రోజున “ముందస్తు పోలింగు” లో పాల్గొనవచ్చు. స్వయంగా గానీ, మెయిలు ద్వారా గానీ, పోస్టు ద్వారా గానీ ఓటు వేయవచ్చు.

ఇప్పటికే ఎనిమిది కోట్లమంది ఓటర్లు ముందస్తు పొలింగులో ఓటుహక్కు వినియోగించుకున్నారని ముందస్తు ఓటింగును అధ్యయనం చేసే ఫ్లోరిడా విశ్వ విద్యాలయానికి చెందిన “ఎలక్షన్ ల్యాబ్” సంస్థ. మొత్తం ఓటర్లలో ఇది సుమారుగా నలభై శాతం ఉంటుందని అంచనా.2020 అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు ఓటింగ్‌లో 47 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుత మెయిల్ ద్వారా ఓటు వేయడానికి ఎన్నికల్లో దరఖాస్తు చేసుకున్న మొత్తం ఆరు కోట్ల డెబ్భై ఐదు లక్షల మంది ఓటర్లలో మూడోతేదీ సాయంత్రానికి మూడు కోట్ల యాభై లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మిగిలిన మూడు కోట్ల ఇరవై రెండు లక్షల మంది కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే ముందస్తు ఓటింగు యాభై శాతం వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఆర్థిక , ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలు, నిరుద్యోగం, అక్రమ వలసలు, తుపాకీ సంస్కృతి, గర్భస్రావపు హక్కులు, పిల్లల పరిస్థితి హక్కులు, ఆరోగ్య సంరక్షణ , సంరక్షణ , గృహ నిర్మాణం, మధ్యప్రాచ్యం , ఉక్రెయిన్ యుద్దాలు, ప్రధాన అంశాలుగా ఎన్నికల ప్రచారంలో ముందుకు వచ్చాయి.

గత మూడు ఎన్నికల్లో వరుసగా పోటీ చేయడం ద్వారా ప్రసిద్ధి చెందిన డోనాల్డ్ జే ట్రంప్ కు వ్యాపారిగా , రియాలిటీ షో నిర్వాహకునిగా, మొరటుగా మాట్లాడే వ్యక్తిగా ఇప్పటికే విస్తృతంగా ప్రసిద్ది చెందారు.జో బైడెన్ పోటీ నుండి వైదొలగడం వల్ల కేవలం మూడు నెలల ముందు మాత్రమే పోటీకి వచ్చిన కమల హారిస్ కు అమెరికా ప్రచారంలో అనకూలత వెంటాడిందని చెప్పాలి.

కమలా హారిస్‌కు మద్దతుగా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, పూర్వపు మహిళలు ప్రథమ హిల్లరీ క్లింటన్, మిషెల్లి ఒబామా, ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్‌వాల్స్, వంటివారు ప్రచారంలో కొనసాగుతున్నారు.డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ. వాన్స్, జాన్ ఎఫ్ కెన్నెడీ మనుమడు ,జూనియర్ కెన్నెడీ , టెస్లా యజమాని, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మాస్క్ , రంగంలోకి దిగి ప్రచారం చేసారు.

ఆదివారం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మిషిగాన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని భావోద్వేగ భరితమైన ప్రసంగం చేశారు. “బహుళత్వం , విశాలమైన వైవిధ్యం ఉన్న అమెరికన్ సమాజంలో విద్వేషానికి తావు లేదు, అందరికీ అవకాశాలు కల్పించే సమ్మిశ్రిత సమాజాన్ని నిర్మించడమే తన లక్ష్యమని” ప్రకటించారు.”

మిషిగాన్‌లో అధిక సంఖ్యలో ఉన్న అరబ్ అమెరికన్ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ ప్రకటన చేశారు.”అందరికీ అవకాశాలు కల్పించే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని” ఆమె చెప్పారు.

రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ జార్జియా, పెన్సిల్వేనియా , రాష్ట్రాల్లో జరిగిన ర్యాలీల్లో గడిపారు. “తనను ఎన్నుకుంటే అమెరికా ను స్వర్ణయుగం వైపు నడిపిస్తానని , ధరల పెరుగుదల ఉండదని, అక్రమ వలసదారుల వల్ల నేరాలు పెరుగుతున్నాయని, వారందర్నీ సామూహికంగా దేశం నుండి బైటికి తరలిస్తానని , అమెరికా అవకాశాలు అమెరికాకు దక్కేటట్లు చూస్తానని” డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

తనకు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ ప్రచారం ఎక్కువై పోయిందని, ఫేక్ న్యూస్ రాసే పాత్రికేయులను ఎవరైనా షూటర్ ముందుకువచ్చి కాల్చి చంపినా ఏమీ అనుకోనని ట్రంప్ ప్రకటించారు.తన సభల్లో కమలా హారిస్ వ్యక్తిత్వాన్ని కించపరిచే నినాదాలను ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టడం డోనాల్డ్ ట్రంప్ ప్రచార ధోరణికి అద్దం పట్టింది.

డోనాల్డ్ ట్రంప్ ను “ఫాసిస్టు” అంటూ డెమొక్రాటిక్ పార్టీ ప్రచారం చేయగా, కమలా హారిస్ ను కమ్యూనిస్టుగా, మార్క్సిస్టుగా, రాడికల్ లెఫ్ట్ గా నిరూపిస్తూ రిపబ్లికన్ పార్టీ ప్రచారం చేయడం విశేషం.తాజా పోల్ సర్వేలో ఇద్దరి మధ్య వ్యత్యాసం 0.9 శాతం మాత్రమే ఉందని ప్రాజెక్ట్ 538 డాట్ కామ్ సంస్థ ఆదివారం ప్రకటించింది. “గెలుపు ఎవరిదన్న అంచనా వేయడం అసాధ్యంగా మారిందని” ఆ సంస్థ పేర్కొంది.

“అయక్డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది” , 538 సంస్థ వ్యవస్థాపకుడు సుప్రసిద్ధ సేపాలజిస్టు నెట్ సిల్వర్ ఆదివారం చెప్పారు.గత అరవయ్యేళ్లుగా ఎన్నికల ఫలితాలు చెప్పడంలో దిట్టగా పేరుపొందిన కమలా హారిస్ దే విజయం అని చెబుతున్నారు. ఆయన గత పది అధ్యక్ష ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజేతను సరిగ్గా అంచనా వేయగలిగినట్లు పేరు పొందారు.

ఓటు వేయడానికి ఆఖరు నిముషంలో నిర్ణయించుకున్న వారిలో సుమారు 16 శాతం మంది ఓటర్ల మనోగతాన్ని అంచనా వేయడానికి “న్యూయార్క్ టైమ్స్ – సియెనా కాలేజి” చేసిన సర్వేలో 55 శాతం మంది ఓటర్లు కమలా హారిస్ వైపు , 36 శాతం మంది డోనాల్డ్ ట్రంప్ వైపు మొగ్గు చూపారని సర్వే నిర్వాహకులు శనివారం వేచి ఉన్నారు.

మొదటి అనిశ్చిత ఫలితాలకు పేరుపడ్డ పెన్సిల్వేనియా, జార్జియా, అరిజోనా, నెవాడా, మిషిగాన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో జరిగిన సర్వేల్లో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో విజేతను అంచనా వేయడానికి అవకాశం లేదని సర్వేసంస్థలు అంటున్నాయి.

ప్రస్తుతం 36 ట్రిలియన్ డాలర్ల అప్పులతో , 2.4 శాతం ద్రవ్యోల్బణంతో , 4.2 శాతం నిరుద్యోగంతో , పెరిగిన ధరలతో, విద్య, వైద్యం , గృహ నిర్మాణం , రవాణా , ఇంధనం , బీమా ఖర్చులు పెరిగిన తరుణంలో అమెరికన్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.దేశంలోని నలుపూ- తెలుపూ , పేద – ధనిక, విద్యాధిక – చదువు తక్కువ, ఆడా – మగ, ఆఫ్రో , ఆసియన్, లాటినో , హిస్పానిక్ , అరబ్ – యూదు ప్రజల ఆకాంక్షలు , మారుతున్న జన బాహుళ్యాల సంస్కృతులు, ఆధునిక , వైవిధ్యం , కలగలిసిన సామాజిక ,ఆర్థిక రాజకీయ సామాజిక ఆకాంక్షలు ఈ ఎన్నికల్లో ఏ రూపంలో వ్యక్తం అవుతున్నా ఆస్వాదించేది ఆహ్లాదకరంగా మారింది.

నవంబర్ 5 న జరిగే తుది పోలింగులో దేశవ్యాప్తంగా పాపులర్ ఓటు ఎవరికి ఎక్కువ వచ్చినా , రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఎవరికి 270 వస్తే వారే విజయం సాధిస్తారు.

డి.సోమసుందర్,

3-11-2024.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech