ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సంచలనం సృష్టిస్తోంది. 2016లో ఎవియల్ పేరుతో రూపొందించిన ఓ సినిమా నాలుగు షార్ట్ ఫిలింస్‌తో నిర్మించారు. ఇందులో ఓర్ట్ షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేయడం ద్వారా తన కెరీర్‌ను రూపొందించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా తర్వాత సందీప్‌కిషన్ హీరోగా తమిళంలో రూపొందించిన మానగరం చిత్రంతో దర్శకుడిగా తనేమిటో ప్రూవ్ తీసుకున్నారు. ఆ తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రారంభించి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా కార్తీతో ఖైదీ రూపొందించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో లింక్ అవుతూ వచ్చిన సినిమాలు కమల్‌హాసన్ విక్రమ్, విజయ్ లియో. ఇప్పటివరకు లోకేష్ డైరెక్ట్ చేసిన సినిమాలు అరడజను మాత్రమే. కానీ, ఎన్నో సినిమాలు చేస్తే వచ్చే కీర్తి ప్రతిష్టలు ఈ అరడజను సినిమాలతోనే అతనికి లభించడం విశేషం.
లోకేష్ డైరెక్షన్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా కూలీ నిర్మాణం జరుపుకుంటోంది. అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఖైదీ2, విక్రమ్2 చిత్రాలు కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వీటితోపాటు రోలెక్స్ అనే ఓ డిఫరెంట్ మూవీ కూడా అతని చేతిలో ఉంది. వచ్చే ఏడాది ఖైదీ 2 రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత రోలెక్స్ విడుదల. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఎంతో మంది స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అందరి కంటే బలంగా ప్రభాస్ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. లోకేష్ యూనివర్స్‌లోని ప్రాజెక్ట్‌ల గురించి ప్రభాస్‌తో చర్చలు జరిగాయి. లోకేష్ చెప్పిన కథ ప్రభాస్‌కి విపరీతంగా నచ్చిందట. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రభాస్‌తో చేయడం తనకెంతో హ్యాపీగా ఉందని సన్నిహితులతో లోకేష్ చెప్పాడని తెలుస్తోంది. ఈ దిల్‌రాజు నిర్మించే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో 2026 వరకు ఉంటారు ప్రభాస్. ఆ తర్వాతే లోకేష్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ నిర్మించారని. లోకేష్ సినిమాలు, ప్రభాస్ సినిమాలు పూర్తయ్యే వరకు ఆగుతారా లేక మధ్యలో ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందా అనేది తెలియాల్సి ఉంది. లోకేష్ కనకరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌కి ప్రస్తుతం ప్రభాస్‌కి ఉన్న క్రేజ్‌కి ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అంటే చెప్పొచ్చు. ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.