- మొదటి విడతలో ఇచ్చేందుకు నిర్ణయం
- రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే అర్హులు
- త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ
- పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలి
- పనిలో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేయండి
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ముద్ర ప్రతినిధి, కూసుమంచి/ఖమ్మం: రేషన్ కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదోళ్లు, బహు పేదోళ్లు ఇలా కేటగిరిల వారీగా పరిశీలించి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ కొత్త గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తుంది. రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లు పొందేందుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు తిరుమలాయపాలెంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొంగులేటి సోమవారం సమావేశమయ్యారు.
ఆయా గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై అధికారులు, నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సమీక్ష సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉడాలని స్థానిక స్థితిగతులపై పట్టుకలిగి ఉంటారని పేర్కొన్నారు. గతంలోనూ ఈ సందర్భంగా చెప్పినట్లు గుర్తు చేశారు. గ్రామంలోనే నివాసం ఉండేలా త్వరగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గ్రామ కార్యదర్శులపై ఎంపీడీవోల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని.
ఆయా గ్రామపంచాయతీ పరిధిలో వికలాంగుల, వృద్ధాప్య, వితంతు మొదలగు పింఛన్‌లకు అర్హులైన వారిని గుర్తించాలని, అనర్హులకు కూడా పింఛను ఇవ్వాలన్నారు. అర్హులకు ఎంతకి ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది…. పొరపాటున ఒక అనర్హుడికి ఇచ్చిన ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ అనర్హుడిని ఉదాహరిస్తూ అర్హత లేని వారు ఇంకెందరో పెన్షన్ తమకూ ఇబ్బందులకు గురిచేస్తారన్నారు. కావున వాటి మీద దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాబోవు ఏడాదిలోపు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, డ్రైనేజీల సమస్య తీరుతుందని.. అత్యవసరమైన తన దృష్టికి తెస్తే తక్షణమే నిర్మాణం చేపట్టాలని చూస్తానని చెప్పారు. సమావేశంలో మండల నాయకులు ఉన్నారు.