ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం 2024 – 25 సంవత్సరానికి గాను మిల్లింగ్ నిబంధనలో భాగంగా రైస్ మిల్లుల యజమానులు బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ నియమం విధించారు. అయితే కొనుగోలు రైస్ మిల్లుల యజమానులు మండిపడుతున్నారు. స్థానిక శుభ మంగళ ఫంక్షన్ హాల్ లో కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించారు. సంఘ అధ్యక్షురాలు, కార్యదర్శులు బోయినపల్లి నర్సింగరావు, తొడుపునూరి కరుణాకర్ లు మాట్లాడుతూ బ్యాంకు పూచికత్తు నిబంధన ఎత్తివేయకుంటే ఈ సీజన్ వడ్లను మిల్లింగ్ చేయమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నిబంధన కొనసాగిస్తే చిన్న రైస్ మిల్లర్లకు సంకట స్థితి నెలకొనే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ధాన్యాన్ని దించుకోవడానికి గోదాములు లేవని, ఒక్కో జిల్లాకు సుమారు 800 కోట్ల వరకు మిల్లింగ్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో రైస్ మిల్లర్లు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఒక్క క్వింటా వడ్లకి 67 కిలోల బియ్యం ప్రభుత్వం చెబుతుంది కానీ తడిసిన ధాన్యం ముక్కిపోయిన వడ్లను మాకు అంటగడితే వాటిని మిల్లింగ్ చేస్తే 55 కిలోల బియ్యం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మిల్లర్లు నష్టపోయారని చెప్పారు. తెలంగాణలో అతిపెద్ద రైస్ ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేయలేదని, వేలాది కుటుంబాలు ఇండస్ట్రీపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. పుష్కలమైన నీటి లభ్యతతో అత్యధికంగా దిగి వస్తుందని ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని, పూచికత్తు నిబంధనను తొలగించి రైస్ మిల్లర్లకు సహకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్యారంటీ పేరుతో రైస్ మిల్లర్లను మోసగాళ్లుగా చిత్రీకరించకూడదని ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఈ సమావేశంలో రా రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షులు తణుకు సురేష్, డైరెక్టర్లు శ్రీధర్, రవీందర్ తో పాటు పలువురు ఉన్నారు.