- బీఆర్ఎస్ నేతలపై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హామీలపై బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన రెండు మేనిఫెస్టోలు.. తమ ప్రభుత్వం ఒక్కో మేనిఫెస్టోతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పది నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్న ఆయన పదేళ్ల పాలనలో కేసీఆర్ పది సార్లు కూడా సచివాలయంలో కూర్చున్న దాఖలాలు లేవని విమర్శలు గుప్పించారు. తెలంగాణకు ఎంత ఆసక్తి ఉంది అనేది నెల రోజుల తర్వాత తేలింది.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణను తుంగలో తొక్కారని. తమ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలు చెబుతామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌కి రేవంత్ రెడ్డి అన్నారు.. దానికి హరీష్ రావు ట్వీట్ చేయడం విడ్లూరం. ఎంతకూ తమ ప్రభుత్వాన్ని విమర్శించడం, అప్రతిష్టపాలు చేయడమే తప్ప మెరుగైన పాలన అందించేలా సలహాలు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీకి వడ్డీ మాత్రమే కట్టారనీ కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్ని కష్టాలైనా వాటిని అధిగమించి పంట రుణాలు మాఫీ చేశారన్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ పడిందన్న ఎంపీ.. దానికోసం బావ, బామ్మర్ది మధ్య పోటీ పెరిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పెట్టలేదనీ కేవలం కలెక్షన్లు..కమీషన్లు దండుకోవడానికే ఆ పార్టీ పెట్టారని. గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అలయన్స్‌లో రబ్బరు చెప్పుల హరీష్ రావు మంత్రి అయ్యారని గుర్తు చేశారు.