Home తాజా వార్తలు గీతదాటితే వేటే … నోటి దురుసు తగ్గించుకోవాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

గీతదాటితే వేటే … నోటి దురుసు తగ్గించుకోవాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
దసరాకు ముహూర్తం...



  • కాంగ్రెస్‌లో పూర్తి స్వేచ్ఛ ఉంది
  • నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు
  • ఎమ్మెల్సీ తీన్మార్ కు సీఎం రేవంత్ వార్నింగ్..?

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సొంత పార్టీ నేతలపై ఆయన చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలు.. రెడ్డి సామాజిక వర్గ నేతలపై దూకుడు తగ్గించుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 2న జరిగిన బీసీ గర్జనలో ప్రసంగించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజికవర్గ నేతలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డే రాష్ట్రానికి చివరి రెడ్డి సీఎం అని చెప్పిన ఆయన మిర్యాలగూడ గర్జనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆస్తులు, ఆదాయంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తీన్మార్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆ వర్గ నేతలు సీఎం, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ సీరియస్ గా తీసుకున్న సీఎం.. మహేశ్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. తీన్మార్ మల్లన్న కాకుండా.. నోరు జారిన ఇతర నేతల గురించి సీఎం రేవంత్ ఆరా తీశారు. పార్టీ చీఫ్ సైతం మల్లన్న తీరుపై తనదైన శైలిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేరుగా మల్లన్నతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నను మందలించినట్టు తెలిసింది. మరోవైపు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న, పాలన తీరుపై తమ అనుచరుల ముందు విమర్శిస్తున్న నేతలపైనా కన్నేసి ఉంచాలని సీఎం, టీపీసీసీ చీఫ్ పలువురికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వారిలో కొందరిపై చర్యలు తీసుకుంటేనే తప్ప మిగిలిన వారి దూకుడుకు కళ్లెం వేయలేమనే భావనతో టీపీసీసీ, ఏఐసీసీ నేతలు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech