- కేసీఆర్ చలువతోనే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడయ్యాడు
- రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో చెప్పాలి
- అమర వీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలి
- వరదసాయం రూ. 10వేల కోట్లు అడిగితే రూ. 400 కోట్లు ఇచ్చారు
- మార్చిలోగా పంచాయతీ బకాయిలు
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా సర్పంచు ఓపికతో లేదు
- గాంధీభవన్ లో మీడియాతో మంత్రి పొన్నం చిట్ చాట్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రయోజనాలు.. ప్రజలు, రైతుల సమస్యలపై సూక్తులు చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు తెలంగాణ డీఎన్ ఏ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆయన డీ ఏలో తెలంగాణ ఉంటే రాష్ట్రానికి కనీసం ఏదో ఒక మంచి చేసేవారని. తెలంగాణ, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన తీరు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలదీస్తున్న ఆయన ముందుగా కేంద్రం రాష్ట్రానికి ఏం ఇచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అమరవీరుల స్తూపం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. సోమవారం భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన కిషన్ గాంధీ రెడ్డికి బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి కేసీఆర్ చలువతోనే వచ్చారు.
బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కేసీఆర్.. మోదిని కోరితే కిషన్ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది. ముందుగా ఎంపీగా, కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకోసం పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని నిలదీశారు. రాష్ట్రం నుంచి కేబినెట్లో పనిచేస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఏం ప్రయోజనాలు చేకూర్చారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మమ్మల్ని ప్రశ్నించే ముందు గత పదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసింది శూన్యమని చెప్పారు. రాష్ట్రంలో వరద నష్టంపై నివేదికను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు తమ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు.
అయితే వరదల వల్ల రూ. 10 వేల కోట్ల నష్టం జరిగితే.. కేంద్రం మాత్రం రూ. 4 వందల కోట్లు మాత్రమే సాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను బిఆర్ఎస్ పార్టీ రెచ్చకొట్టే కార్యక్రమం ముగిసింది.. వారికి న్యాయం చేయడానికి తాము వెళతామన్నారు. ఎల్తామన్నారు.రాష్ట్రంలోని మాజీ సర్పంచ్‌లకు పెండింగ్‌లో ఉన్న బిల్లుపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన పొన్నం.. వంద ఎలుకలు తిన్న పిల్లల మాదిరిగానే బీఆర్ఎస్ నేతలు మాజీ సర్పంచుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ హయాంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయిన వారే.. నేడు వారికి మద్దతుగా ధర్నాలు జరిగాయి. రాష్ట్రంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత లేదని స్పష్టం చేశారు.
సర్పంచులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయం అందరికి తెలుసునని చెప్పారు. కాస్త ఓపిక పట్టాలని ఈ సందర్భంగా మాజీ సర్పంచులకు మంత్రి సూచించారు. వచ్చే మార్చి ఏడాదిలోగా పూర్తి బకాయిలు చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సర్పంచుల బాయిలు చెల్లించేందుకు తమ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోంది. పొలిటికల్ పార్టీల ట్రాప్‌లో పడకండంటూ తెలంగాణలోని మాజీ సర్పంచులకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.