38
ముద్రణ న్యూస్ బ్యూరో ,హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ బీఆర్ నాయుడు ఆదివారంనాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ శ్రీరామనగరంలో త్రిదండి చిన జీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యాక తొలిసారిగా చిన జీయర్ స్వామి ఆశ్రమంలో స్వామీజీని ఆయన కలుసుకున్నారు. బి ఆర్ నాయుడుకు చిన జీయర్ స్వామి మంగళ శాసనాలు. తిరుమల- తిరుపతి పవిత్రతను కాపాడుతూనే తిరుపతికి పూర్వ వైభవం తీసుకురావాలని బీఆర్ నాయుడుకు జీయర్ స్వామి సూచించారు.