31
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ముంబై పోలీసులకు ఫోన్ చేశాడు. పది రోజుల్లో యోగి తన పదవికి రాజీనామా చేయడానికి హెచ్చరించాడు. లేదంటే బాబా సిద్దిఖీ లాగా యోగి ఆదిత్యనాథ్ కూడా చనిపోతాడని బెదిరించాడు. ఈమేరకు ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ ఫోన్ సెంటర్ కు శనివారం సాయంత్రం ఓ వ్యక్తి చేసి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతని ఫోన్ కాల్ ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి చేశారనే వివరాలు ఆరా తీస్తున్నారు. బెదిరింపులకు ప్రదర్శించిన ఆగంతకుడిని పట్టుకునేందుకు దర్యాఫ్తు కోసం.