- ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ
- ఏక్యూఐ స్థాయి 50
- రాష్ట్రంలో పలు చోట్ల 150కి మార్క్ దాటిన వైనం
- మాస్క్ ధరించాలంటున్న నిపుణులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వాయు కాలుష్యం ఏర్పడింది. వాహనాలు … పరిశ్రమలు ఇప్పటికే పొగ పెడుతుంటే ..దీపావళి బాణా సంచాతో గండంపై మరింత సెగ పడింది. ప్రధానంగా రాష్ట్ర రాజధానితో పాటు వరంగల్, నిజామాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో తగ్గుతోంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఢిల్లీ తరహాలోనే డేజర్ బెల్స్ మోగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పెరుగుతోన్న వాయు కాలుష్యం నగరవాసులను కలవరపెడుతోంది. ఈ కాలుష్యంతో దశాబ్దకాలంలో నగరంలో 6వేల మందికి పైగా చనిపోయాయి. లాన్‌సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది.
వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్ -10 నగరాలలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. తరువాత స్థానాల్లో ముంబయి, బెంగళూరు, పుణె, చెన్నై నగరాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చి బౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధిక వాయు కాలుష్యం ఉంది. గత గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా డి యూఎస్ కాన్సులెట్ వద్ద 92, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్‌బీ పాయింట్ నమోదు ఫేజ్–2 వద్ద 84, కోకాపేట పాయింట్లు దీపావళి టపాసులతో వాయుళి నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
గుండె, శ్వాసకోశ, కండరాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏక్యూఐ 128 ఉండగా, పార్టిక్యులేట్ మ్యాటర్ స్థాయి 2.5 గ్రాములు ఉంది. వరంగల్‌లో అత్యధికంగా ఏక్యూఐ 143 ఉండగా, పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర నమోదైంది.వ్యర్థాలకు మంట.. ప్రాణాలకు పొగతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల కాలుష్య ప్రాంతాలుగా మసకబారాయి. గాలి చాటున గత్తర దూసుకు వస్తోందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. గాలి నాణ్యతకు సంబంధించి వివిధ సంస్థల అధ్యయనాల్లో సంచలనాలు వెలుగుచూశాయి.
ఏక్యూఐ స్థాయి 50 దాటిందంటే..గాలి గాడి తప్పినట్టే. తెలంగాణలో ఇప్పుడు చాలా చోట్ల 100 నుంచి 150 మార్క్‌ను టచ్ చేసినట్లు తేలింది. ఏక్యూఐ స్థాయి 50 నుంచి 100 మధ్య ఉంటే గాలి నాణ్యత పూర్‌క్వాలిటీ , 100 నుంచి 150 వరకు ఉంటే ‘అన్‌హెల్దీ’, 150 నుంచి 200 రికార్డయితే డేంజర్.. ఇక AQI మూడు వందల రేంజ్‌లోకి వెళ్లింది ఇక ప్రాణాలకు మూడినట్టే. 300 ప్లస్ రికార్డయితే పరిస్థితి ఆందోళనకరంగా మారనుంది. కలుషితమైన గాలితో శ్వాస సంబంధ వ్యాధులతో గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాలుష్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. వ్యక్తిగతంగా ప్రాణాలు కాపాడుకోవాలంటే రూల్ పాటించాలని, మాస్క్ ధరించాలని నిపుణులు కీలక సూచనలు చేశారు.