- వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్
- డిసెంబర్ లోపు రూ.13 వేల కోట్ల రుణాలు మాఫీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వేడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేయవచ్చని తెలియజేసారు. మద్దతు ధర ఇవ్వడంతో పాటు తేమ 12 శాతం ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి పంట నష్టపోయారని ఆయన చెప్పారు.. రెండు లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వారికి సన్నరకం వడ్లకు 500 బోనస్ ఇవ్వబడుతుంది.
ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకోవాలని సూచించారు. సీసీఐ నామ్స్ ప్రకారం పత్తిని తీసుకురావాలని రైతులను నిర్ణయించారు. ఒక్క కేజీ తరుగు తీయొద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు ఫిర్యాదు చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. రైతులకు ఎక్కడ నష్టం కలుగకుండా చూడాలన్నారు. రైతుల అవసరం, మనపై కష్టాలు తీర్చాల్సిన బాధ్యత. తల తాకట్టు పెట్టైనా అర్హులైన రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ లోపే రూ. 13వేల కోట్ల రుణమాఫీ అమలు చేసింది. దీపావళి కానుకగా అర్హులైన పేదలకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు.