38
దివంగత నందమూరి హరికృష్ణ(హరికృష్ణ)మొదటి కొడుకు జానకి రామ్(జానకిరామ్) ఒక యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఆయన తనయుడు తారకరామారావు హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అందుకు సంబంధించి రీసెంట్ గా తారకరామారావు పరిచయ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(ఎన్టీఆర్)తన ట్విట్టర్ వేదికగా మొదటి దశలో అడుగుపెడుగుతున్న రామ్ కి ఆల్ ది బెస్ట్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడమే కాకుండా లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్ప మరేమీ రాదు. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాత హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. బాగా చెయ్యి అబ్బాయి అంటూ ట్వీట్ చేసాడు.