ముద్ర.వీపనగండ్ల :- హామీ, పోలీసులు తమను పట్టుకున్న ఎంతో కొంత ముట్టచెప్పి లేదా నామకవస్తుగా ఫైన్ లు కట్టి వస్తున్నామని ధీమాతో ఇసుక అక్రమ రవాణా వ్యాపారస్తులు పట్టపగలే యదేచ్చగా వాగులో నెంబర్ లేని జెసిబి తో ఇసుక ను తవ్వుతూ అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మండల పరిధిలోని తూముకుంట వాగు నుంచి పట్టపగలే ఇసుక తవ్వకాలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్న వారికి అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. తూముకుంట వాగు నుంచి నిత్యం పదుల సంఖ్యలో ఇసుక తరలిస్తున్న అధికారుల చోద్యం చూస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.
వనపర్తి నుంచి వచ్చే స్పెషల్ పోలీసులు మాత్రమే పలుమార్లు తూముకుంట కుంట వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇసుకతో పట్టుబడిన ట్రాక్టర్లను బైండోవర్ చేయటం గాని, మైనింగ్‌కు అప్పజెప్పడంతో జరిమానాలు విధించకుండా ట్రాక్టర్ యజమానులు వాటిని చెల్లించి మళ్లీ యదేచ్చగా తరలిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం గ్రామానికి చెందిన ట్రాక్టర్లు ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని కేసులు నమోదు చేశారు, మంగళవారం తూముకుంట వాగులో జావాయిపల్లికి చెందిన నెంబర్ లేని జెసిబి తో ఇసుక తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పట్టపగలే రోజు ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న పోలీసు లు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఇదేనా కఠిన చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటూ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.