33
ముద్ర, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన సమయంలో నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం సహకరించారని జ్యోతిపై వచ్చిన ఆరోపణల మేరకు ఆమెను ఆరెస్టు చేసి మేడ్చల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
మేడ్చల్ కోర్టు సబ్ రిజిస్ట్రార్ జ్యోతికి 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. సుభాష్ నగర్లో 200 గజాల నకిలీ పత్రాలతో పద్మాజా రెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. కాగా, అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన జ్యోతి ల్యాండ్ కాంపౌడ్ కోసం పద్మజా రెడ్డికి సహకరించింది. పోలీసులు ఇటీవల పద్మజా రెడ్డిని అరెస్ట్ చేయగా తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం అరెస్ట్ చేశారు.